వడగాలితో మటన్ వండేశాడు

గతేడాది వేసవిలో భారత్‌లో పెరిగినట్లుగా ఆస్ట్రేలియాలోనూ సమ్మర్ హీట్ దంచేస్తుంది. వడగాలుల దెబ్బకు మనుషులు ఇంట్లోంచి బయటకు రావడం మానేస్తున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మీ పెంపుడు జంతువులను బయటకు పంపి వదిలేయకండి. కార్లలో మర్చిపోతే ఇక అంతే సంగతులు.
రోజుకు 60డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో మాంసం ఉడికిపోతుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఓ వ్యక్తి ఈ ఉష్ణోగ్రతను తెలివిగా వాడుకున్నాడు. ఈ చిన్న ప్రయోగం చేసిన కారులో 1.5కేజీల మటన్ వండుకున్నాడు. కారు బాడీపై మటన్ ఉంచి దానిని ఉడికించాడు. బయట వేడికి కారు ఓవెన్‌లా మారిపోయింది. కొద్ది గంటల్లోనే ఉడికిపోయింది.
కారు లోపలి ఉష్ణోగ్రతను థర్మామీటర్ సహాయంతో లెక్కించాడు. ఉదయం 30డిగ్రీలు ఉన్న టెంపరేచర్ 81డిగ్రీలకు పెరిగిపోయింది. కేవలం ఆరు నిమిషాల్లోనే కారు హీట్ అయిపోతుందంటూ వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పాడు.
‘విలువైనవి ఏవీ కారులో వదిలివెళ్లకండి. నిమిషాల్లో కారు వేడెక్కిపోతున్నాయి. పసిపిల్లలని, కుక్క పిల్లలను కారులో వదిలి వెళ్తే అంతే సంగతులు’ అని హెచ్చరిస్తున్నాడు. ఇంకా అతను వండిన మాంసపు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ సారి వడగాలుల వేడితో డాట్సన్ కారుపై బీఫ్‌ను వండుతానంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. బహుశా రెండు గంటల్లో కూర రెడీ అయిపోతుదంటూ చెప్పుకొచ్చాడు.