Resign Letter viral : టాయిలెట్ పేప‌ర్ మీద రిజైన్ లెటర్ రాసిచ్చిన ఉద్యోగి..బాస్ రియాక్షన్ చూసి దిమ్మతిరిగిపోయిందిగా..

ఓ ఉద్యోగి కొత్తగా చేయాలనుకున్నాడో ఏమోగానీ..తన రిజైన్ లెటర్ ను టాయిలెట్ పేపర్ పై రాసిచ్చాడు. అది చూసిన బాస్ రియాక్షన్ కు దిమ్మతిరిగిపోయాడు.

Resign Letter viral : టాయిలెట్ పేప‌ర్ మీద రిజైన్ లెటర్ రాసిచ్చిన ఉద్యోగి..బాస్ రియాక్షన్ చూసి దిమ్మతిరిగిపోయిందిగా..

Resignation Letter On Toilet Paper

Updated On : November 26, 2021 / 6:10 PM IST

Resignation Letter on Toilet Paper : ఓ ఉద్యోగి కొత్తగా చేయాలనుకున్నాడో ఏమోగానీ..తన రిజైన్ లెటర్ ను వినూత్నంగా ఇచ్చాడు.అందరిలా తాను ఎందుకు మామూలు పేపర్స్ పై రిజైన్ లెటర్ రాయాలి? అని అనుకున్నాడో ఏమోగానీ..వెరైటీగా చేశాడు.‘టాయిలెట్ పేప‌ర్ మీద త‌న రాజీనామా లేఖ‌ను రాసి బాస్ కి ఇచ్చాడు. అదిచూసిన బాస్ ఉగ్రుడైపోతాడని..లేదా చీవాట్లు పెడతాడని అనుకున్నాడు. కానీ బాస్ మాత్రం కూల్ గా ‘వెరీ గుడ్ నీ క్రియేటివిటీ బాగుందోయ్..’ అని అనేసరికి సదరు ఉద్యోగికి దిమ్మతిరిగిపోయింది. అతనికేంటీ బాస్ రియాక్షన్ ని ఊహించిన ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.

Read more : Viral Resign Letter : మహిళా ఉద్యోగి వెరైటీ రిజైన్ లెటర్..బాస్ కి దిమ్మ తిరిగిపోయిందిగా..

లూయిస్ అనే ఉద్యోగి త‌న రాజీనామా ని టాయిలెట్ పేప‌ర్ మీద ‘25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను’ అని రాసాడు. అక్కడితో ఊరుకోలేదు అతని పైత్యం..త‌న ‘బ్యాక్’ చూపిస్తున్న‌ట్టుగా ఓ బొమ్మకూడా వేశాడు. దాన్ని రెడిట్‌లో పోస్ట్ చేసి.. మా బాస్‌కు ఇదే రాజీనామా ప‌త్రాన్ని ఇవాళ ఇవ్వ‌బోతున్నా అంటూ క్యాప్ష‌న్ కూడా పెట్టాడు.ఇక‌.. దాన్ని తీసుకెళ్లి బాస్‌కు ఇచ్చాడ‌ట‌. బాస్ ఏమాత్రం కోపగించుకోకుండా..సదరు పైత్యగాడి ‘క్రియేటివిటీ’ని మెచ్చుకున్నాడ‌ట‌. ఆ విషయాన్ని టూయిసే చెప్పాడు.

Read more : కానిస్టేబుల్ లీవ్ గోల : బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..

ఇంకా లూయిస్ ఏమన్నాడంటే..ఈ ఉద్యోగం మంచిది.నేను ఆ జాబ్‌లో చాలా ఎంజాయ్ చేశాను..కానీ రిజైన్ లెటర్ ఇలా రాయాలని అనిపించి రాసిచ్చాను.బాస్ కూడా చాలా కూల్ గా ఏమీ అనలేదంటు చెప్పుకొచ్చాడు. ాకనీ నెటిజ‌న్లు ఇటువంటి రాజీనామా ప‌త్రాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు. ఇలా కూడా ఇస్తారా? అని కొందంటే..మరికొందరు..ఓరినాయనో టాయిలెట్ పేపర్లు కూడా రిజైన్ లెటర్ కు వాడుకోవచ్చని చెప్పిన మేధావీ నీ పైత్యం మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more : నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్