రూ.500కోట్ల ఖర్చుతో 300 అడుగుల సమాధిలో కరోనా శవాలు

చైనాలో కట్టడి చేసిన కరోనా.. రోజుల వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు వేగంగా పాకుతుంది. లక్షా 28వేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల్లో చైనా, దక్షిణ కొరియాలతో పాటు ఇరాన్, ఇటలీల్లోనూ మెజారిటీ కేసులు కనిపిస్తున్నాయి. చైనాలో కేసులు నమోదవడం తగ్గిపోతుండేసరికి ఇరాన్, ఇటలీకి వైద్య సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది చైనా.
ఇరాన్‌లో గురువారం 75 కరోనా మృతులు నమోదవడంతో మొత్తంగా ఆ దేశంలో ఇప్పటికీ 429మంది కరోనా కారణంగా చనిపోయారు. . ’24గంటల్లోనే వెయ్యి 75కేసులు నమోదయ్యాయి. దీంతో ఇరాన్ దేశంలో 10వేల 75మందికి ఇన్పెక్షన్ సోకినట్లు తేలింది. చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడం మరో సమస్యగా మారింది.
See Also | కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ కాపాడుతుందా?
వారందరినీ ఖననం చేసేందుకు గానూ నిధులు కావాలంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(IMF)ను సహాయం అడిగింది. 5బిలియన్ డాలర్లు అంటే రూ.500కోటులు కావాలని అడిగింది. ఈ క్రమంలోనే ఇరాన్ అతి పెద్ద సమాధి తవ్వింది. అంతరిక్షం నుంచి చూసినా కనపడేంత పెద్ద స్థాయిలో ఉన్నట్లు ఇంగ్లీషు మీడియా తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 145కిలోమీటర్ల దూరంలో సమాధిని ఏర్పాటు చేస్తున్నారు.
100యార్డులు అంటే 300అడుగుల వెడల్పుతో సమాధిన తవ్వారు. అందరినీ ఒకేసారి పాతిపెట్టే ఏర్పాటు చేస్తున్నారు. ఇరాన్‌లో సామాన్య వ్యక్తులతో పాటు అధికారులకు కూడా కరోనా సోకింది. ఆయతుల్లా అలీ ఖమినీ కూడా కరోనా బాధితుడే. ఫిబ్రవరి 19నాటికి 7మంది రాజకీయ నాయకులు, అధికారులు చనిపోయారు.
See Also | కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.3.30 లక్షలు బహుమతి!