Iran Port Explosion: బాబోయ్.. ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికిపైగా గాయాలు
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Iran Port Explosion: భారీ పేలుడు ఇరాన్ తీరప్రాంత నగరాన్ని కుదిపేసింది. ఇరాన్ తీరప్రాంత నగరం బందర్ అబ్బాస్ సమీపంలోని షాహిద్ రజాయి నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి 406 మంది గాయపడ్డారు. కాగా, ఈ పేలుడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోర్టులో పెద్ద సంఖ్యలో ఒకేచోట కంటైనర్లు నిల్వ ఉంచారు. అక్కడే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
పేలుడు తర్వాత దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. ఘటనా స్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు.
రజాయి పోర్టులో ప్రధానంగా కంటైనర్ల కార్యకలాపాలు జరుగుతాయి. ఏటా 80 మిలియన్ టన్నుల సరకు ఎగుమతి, దిగుమతి అవుతుంది. స్థానికంగా చమురు ట్యాంకులు, పెట్రోకెమికల్ సౌకర్యాలు ఉన్నాయి. ఒమన్‌లో ఇరాన్, అమెరికా మధ్య మూడవ రౌండ్ అణు చర్చలు ప్రారంభమైన సమయంలోనే ఈ పేలుడు సంభవించడం కలకలం రేపింది.
ది జెరూసలేం పోస్ట్ ప్రకారం, ఈ పేలుడు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికా స్థావరం సమీపంలో సంభవించింది. ఈ పేలుడులో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించింది.
Also Read: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు ఎందుకు హాజరుకాలేదంటే? అసలు రీజన్ ఇదే!
పేలుడు తర్వాత నల్లటి పొగ కమ్ముకున్న దృశ్యాల వీడియోలు భయాందోళనకు గురి చేశాయి. “షాహిద్ రజాయి పోర్ట్ వార్ఫ్‌లో నిల్వ చేసిన అనేక కంటైనర్లు పేలిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం” అని స్థానిక అధికారులు తెలిపారు.
షాహిద్ రజాయి నౌకాశ్రయంలో చోటు చేసుకున్న పేలుడు, అగ్ని ప్రమాదం తమ చమురు సౌకర్యాలపై ఎటువంటి ప్రభావం చూపలేదని నేషనల్ ఇరానియన్ పెట్రోలియం రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (NIPRDC) స్పష్టం చేసింది. “షాహిద్ రజాయి పోర్టులో జరిగిన పేలుడు, అగ్నిప్రమాదానికి ఈ కంపెనీకి సంబంధించిన శుద్ధి కర్మాగారాలు, ఇంధన ట్యాంకులు, పంపిణీ సముదాయాలు, చమురు పైపులైన్లకు ఎటువంటి సంబంధం లేదు” అని NIPRDC ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
Also Read: దెబ్బ అదుర్స్ కదా.. భారత్ దెబ్బకు విలవిల్లాడుతున్న పాకిస్థాన్.. ఏం జరుగుతుందో చూడండి..
The more I read about this explosion today in Bandar Abbas, the more I think about the reports about those #Iran cargo ships docking in Bandar Abbas after departing #China with missile components. pic.twitter.com/X0Rxrx51Na
— Jason Brodsky (@JasonMBrodsky) April 26, 2025
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here