ISIS Terrorists Arrest : పాకిస్తాన్ లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు ఐసిస్ టెర్రరిస్టులు అరెస్టు

పంజాబ్ ప్రావిన్స్ అంతటా విధ్వంసం సృష్టించాలని టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ఉగ్రవాదులను జకీరుల్లా, మహ్మద్ ఈషాగా పోలీసులు గుర్తించారు.

ISIS Terrorists Arrest : పాకిస్తాన్ లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు ఐసిస్ టెర్రరిస్టులు అరెస్టు

ISIS Terrorists Arrest

Updated On : September 9, 2023 / 7:34 PM IST

Pakistan ISIS Terrorists Arrest : పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్ ప్రావిన్స్ లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ పోలీస్ విభాగానికి చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఇద్దరు ఉగ్రవాదులను గుజ్రన్ వాలా, రావాల్పిండి ఏరియాల్లో అరెస్టు చేశామని పేర్కొన్నారు.

ఐసిస్ ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిషేధిత సామాగ్రిని కూడా సీజ్ చేశామని తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్ అంతటా విధ్వంసం సృష్టించాలని టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.

Srinagar: తప్పిన పెను ప్రమాదం..! భారీగా పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన భద్రతా దళాలు

ఇద్దరు ఉగ్రవాదులను జకీరుల్లా, మహ్మద్ ఈషాగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల పేలుడు పదర్థాలు, 8 డిటోనేటర్లు, 13 ఫీట్ల సేఫ్టీ ఫ్యూజ్ వైర్, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇద్దరు ఉగ్రవాదులపై రెండు కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.

టెర్రరిస్టులను రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారని తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్ లో ఎలాంటి విధ్వంసం చోటు చేసుకోకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.