Srinagar: తప్పిన పెను ప్రమాదం..! భారీగా పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన భద్రతా దళాలు
పాకిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు. అప్పుడే భారతదేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రమూకలు వ్యూహరచన చేశాయి. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై ప్లై ఓవర్ వద్ద ఐఈడీని అమర్చారు.

Jammu and Kashmir
Baramulla: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. భద్రతా దళాలు టార్గెట్‌గా ఉగ్రవాదులు అమర్చిన పేలుడు పదార్థాలను బాంబు డిస్పోజల్ స్వ్కాడ్‌ను పిలిపించి నిర్వీర్యం చేశారు. ముందస్తుగా భద్రతా దళాలు బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. శ్రీనగర్ – బారాముల్లా జాతీయ రహదారిపై జంగం ప్లైవర్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు పదార్థాలను ముందుగానే గుర్తించిన భద్రతా దళాలు ఆ మార్గంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశారు. ఈ మార్గంలో నిత్యం భద్రతా దళాల కాన్వాయ్ లు వేకువజామున సమయంలో ప్రయాణిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకొని పేలుడు పదార్థాలను పెట్టినట్లు భావిస్తున్నారు.
Massive Explosion In Pakistan : పాక్‍లో భారీ పేలుడు.. 60మందికి పైగా మృతి
పాకిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు. అప్పుడే భారతదేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రమూకలు వ్యూహరచన చేశాయి. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై ప్లై ఓవర్ వద్ద ఐఈడీని అమర్చారు. సంగమ్ ప్లే ఓవర్ వద్ద ఒక బ్యాగ్ కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమై పరిశీలించారు. పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించి వెంటనే బాంబ్ స్వ్కాడ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని ఆ వస్తువులను ఐఈడీగా అనుమానించారు. వాటిని బాంబు స్వ్కాడ్ స్వాధీనం చేసుకొని, ఆ తరువాత నిర్మానుష్య ప్రదేశంలో వాటిని నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ ఈ పేలుడు గనుక జరిగితే భారీగా నష్టం వాటిల్లేది.