గొప్ప హృదయం : హ్యాపీ క్రిస్మస్..36 కుటుంబాలకు సాయం

కొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ వస్తోంది. ఇప్పటికే అందరూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంది. కొనుగోలు చేసేందుకు వచ్చే వారితో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఆనందానికి దూరంగా ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు. కరెంటు బిల్లులు (utility bills) చెల్లించి..వారిలో ఆనందం నింపాడు.
తాను కూడా గతంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడని, ఇతరులు ఆ సమస్యలు ఎదుర్కొనకూడదనే ఉద్దేశ్యంతో తాను ఈ విధంగా చేయడం జరిగిందని వెల్లడించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అమెరికాలో ఫ్లోరిడా ప్రాంతంలో మైకెల్ నివాసం ఉంటున్నారు. స్పా నిర్వహిస్తూ జీవితం సాగదీస్తున్నారు. ఇటీవలే మైకెల్ ఇంటికి కరెంటు బిల్లు వచ్చింది. డిసెంబర్ 26 లాస్ట్ డేట్ అని ఉంది. గతంలో జరిగిన ఘటనలు ఒక్కసారిగా అతని మదిలో మెదలాయి. 1980లో కరెంటు బిల్లు కట్టనందుకు ఇంటికి గ్యాస్ సరఫరా ఆగిపోయింది. చలికాలంలో అనేక ఇబ్బందులు పడ్డాడు.
క్రిస్మస్ వేడుకను కూడా ఆనందంగా చేసుకోలేకపోయాడు. ఫ్లోరిడాలో చలి విపరీతంగా ఉంటుంది. కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో 36 కుటుంబాలకు చెందిన కరెంటు బిల్లులను చెల్లించాలని అనుకున్నాడు. మొత్తం 4 వేల 600 అమెరికా డాలర్లు చెల్లించాడు. డబ్బులు లేని కారణంగా క్రిస్మస్ ఆనందం ఆవిరి కాకూడదని..అనుకుని ఈ విధంగా చేసినట్లు వెల్లడించారు. 2019, డిసెంబర్ 17వ తేదీన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. పలువురు అబినందిస్తున్నారు.
The season of giving is here. Michael Esmond paid off 36 families’ utility bills. He found out who was at risk of having their power turned off. He spent $4,600 making their holidays a little less stressful.
Instead of warnings, the families received these cards. @weartv pic.twitter.com/7C3YGcy3oG
— Danielle Apolinar (@DanielleApoNews) December 17, 2019