అమ్మో.. బాంబు తుపాన్.. అమెరికా గజగజ

ప్రపంచ అగ్రదేశమైన అమెరికాను బాంబు ‘మంచు’ తుపాన్ గజగజ వణికిస్తోంది. బలమైన గాలులు, భారీ హిమపాతంతో కూడిన మంచు గ్రేట్ లేక్స్ రీజియన్ లోకి ఉధృతంగా ప్రవహిస్తోంది.

అమ్మో.. బాంబు తుపాన్.. అమెరికా గజగజ

Updated On : March 17, 2021 / 10:29 AM IST

ప్రపంచ అగ్రదేశమైన అమెరికాను బాంబు ‘మంచు’ తుపాన్ గజగజ వణికిస్తోంది. బలమైన గాలులు, భారీ హిమపాతంతో కూడిన మంచు గ్రేట్ లేక్స్ రీజియన్ లోకి ఉధృతంగా ప్రవహిస్తోంది.

మిడిల్ అమెరికా : ప్రపంచ అగ్రదేశమైన అమెరికాను బాంబు ‘మంచు’ తుపాన్ గజగజ వణికిస్తోంది. బలమైన గాలులు, భారీ హిమపాతంతో కూడిన మంచు గ్రేట్ లేక్స్ రీజియన్ లోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. మంచు తుపాన్ కారణంగా.. విద్యుత్ సరఫరా నిలిచిపోయి వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొలరెడో రీజియన్ లో రవాణా సౌకర్యానికి పరిస్థితులు ప్రమాదకరంగా మారిపోయాయి. నెల రోజుల వ్యవధిలో మరోసారి బాంబు తుపాన్ విజృంభించడంతో నెబ్రాస్కా, దక్షిణ డకోటా ప్రాంతాల్లో వందలాది స్కూళ్లను మూసివేశారు.
Read Also : చంద్రుడిపై కూలిన ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక

రోడ్లపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోవడంతో ఇతర ఆఫీసులు, గవర్నర్ కార్యాలయాలు వరుసగా రెండోరోజు మూతపడ్డాయి. రోడ్లపై వెళ్లే వాహనాలు దాదాపు 500 వరకు మంచులో కురుకుపోయాయని, మంచులో చిక్కుకుపోయిన వాహనాదారులను రక్షించేందుకు నేషనల్ గార్డ్ సహాయక చర్యలు చేపట్టినట్టు మిన్నెసోటా స్టేట్ పెట్రోల్ విభాగం తెలిపింది. మంచు తుపాన్ కారణంగా డెన్వెర్ అంతర్జాతీయ విమానశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేశారు. వాతావరణంలో ఉష్ణగ్రతల స్థాయి ఒక్కసారిగా తగ్గిపోయి భారీ స్థాయిలో హిమపాతం కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది.

ఇప్పటికే పలు హైవేలను మూసివేశారు. భారీగా హిమపాతం పడటంతో నార్తరన్ విస్కోన్సిన్ మిచిగాన్, మిడ్ వెస్ట్, గ్రేట్ లేక్స్ ప్రాంతాల్లో మంచు తుపాన్ హెచ్చరికలు జారీ చేశారు. దక్షణ డకోటాలో 25 అంగుళాలతో కూడిన మంచు పేరుకుపోయినట్టు వెదర్ సర్వీసు మెట్రోలాజిస్ట్ స్టీవెన్ ఫ్లెజీల్ తెలిపారు. కెన్సాస్ సిటీలో గంట వ్యవధిలో ఉష్ణోగ్రత.. 20 డిగ్రీలకు పడిపోయిందని, భారీగా చల్లటి గాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ డకోటా ప్రాంతంలో రోడ్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ఎవరూ రోడ్లపై వాహనాలతో బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.