Malicious Extraterrestrial: భూమిపై దాడి చేయగల నాలుగు ప్రమాదకర గ్రహాంతర ఆవాసాలు పాలపుంతలో ఉన్నాయి
మన పాలపుంతలో ఇప్పటికే కొన్ని గ్రహాల్లో జీవులు ఉన్నాయని..అవి రానున్న రోజుల్లో భూమిపై దాడికి దిగుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Aliens
Malicious Extraterrestrial: అంతరిక్ష పరిశోధనలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అనంతకోటి విశ్వంలో భూమిలాంటి గ్రహాలు, గ్రహాంతర వాసుల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. పాలపుంతపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు మరో సంచలన విషయం వెల్లడించారు. మన పాలపుంతలో ఇప్పటికే కొన్ని గ్రహాల్లో జీవులు ఉన్నాయని..అవి రానున్న రోజుల్లో భూమిపై దాడికి దిగుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పాలపుంతలోని నాలుగు గ్రహాల్లో నాగరికత ఏర్పరచుకున్న గ్రహాంతర వాసుల నుంచి భూమికి ప్రమాదం పొంచి ఉందన్నది ఈ పరిశోధనల సారాంశం. స్పెయిన్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్ విగో’లో PhD చేస్తున్న అల్బెర్టో కాబల్లెరో అనే విద్యార్థి, 1977లో కనుగొనబడిన “WoW సిగ్నల్ ” యొక్క ఖచ్చితమైన మూలాన్ని తాను గుర్తించినట్లు ‘vice’ మీడియాతో చెప్పాడు.
Other Stories: biggest plant: ఆస్ట్రేలియా తీరంలో అతిపెద్ద మొక్క.. ఎన్ని కిలోమీటర్లో తెలుసా..!
ఇది భూమికి 1,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యుడిలాంటి నక్షత్రం నుండి ఉద్భవించిందని ఆయన అభిప్రాయపడ్డారు. “ప్రమాదకరమైన గ్రహాంతర నాగరికతల ప్రాబల్యాన్ని అంచనా వేయడం” అనే వ్యాసంలో కాబల్లెరో ఈ విషయాలు వెల్లడించాడు. కాబల్లెరో యొక్క పరిశోధన మరింత “ఆలోచింపజేసే ప్రయోగం”గా పరిగణించారు. మనం పంపే సందేశాలను తిరిగి మార్చగల గ్రహాంతర జీవుల నాగరికతలకు ఒక సంఖ్యను కేటాయించడం సహా ఇతర శాస్త్రవేత్తలను హెచ్చరించడం తన పరిశోధన లక్ష్యమని అల్బెర్టో కాబల్లెరో తన వ్యాసంలో పేర్కొన్నాడు. ఇందులో భాగంగా 1977లో వచ్చిన వావ్ సిగ్నల్ సహా భూమిపైకి చేరిన ఇతర ఆక్రమణల సంఖ్యను కూడా లెక్కించిన కాబల్లెరో అనంతరం పాలపుంతలో గ్రహశకలాల అంచనా సంఖ్యకు దీనిని వర్తింపజేశాడు.
Other Stories: Russia warns USA: యుక్రెయిన్‌కు హైటెక్ ఆయుధాల సరఫరా పై అమెరికాకు రష్యా తీవ్ర హెచ్చరిక
అతని లెక్కల ప్రకారం, భూ గ్రహంపై దాడి చేయగల గ్రహాంతర నాగరికతల సంఖ్య నాలుగు ఉన్నాయి. ఈక్రమంలో మెసేజింగ్ ఎక్స్ ట్రా టెర్రిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ (METI)) పద్ధతిని ఉపయోగించుకోవడంలో మనం జాగ్రత్తగా ఉండాలని ఆయన శాస్త్రవేత్తలను హెచ్చరించారు. కాగా ఇటీవలి కాలంలో గ్రహాంతర జీవుల గురించి అమెరికా చేస్తున్న పరిశోధనలు, ప్రకటనల నేపథ్యంలోనే అల్బెర్టో కాబల్లెరో రాసిన వ్యాసం వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.