పాక్‌ పర్మిషన్ కావాలి: మోడీ విమానం కోసం భారత్ రిక్వెస్ట్

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి అనుమతించాలని పాక్‌ను భారత్ అనుమతి అడిగింది.

పాక్‌ పర్మిషన్ కావాలి: మోడీ విమానం కోసం భారత్ రిక్వెస్ట్

Updated On : September 18, 2019 / 9:44 AM IST

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి అనుమతించాలని పాక్‌ను భారత్ అనుమతి అడిగింది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి అనుమతించాలని పాక్‌ను భారత్ అనుమతి అడిగింది. ఈ విషయాన్ని పాక్ మీడియా వెల్లడించింది. ‘ప్రధాని నరేంద్ర మోడీ విమానం న్యూయార్క్‌కు వెళ్లాల్సి ఉంది. దాని కోసం పాక్ నుంచి అనుమతి కావాలని భారత్ అడిగిందని’ పాక్ మీడియా వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 21నుంచి 27వరకూ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. 

ఈ నెల ఆరంభంలో పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్‌లో ప్రయాణించేందుకు వీలులేదని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విమానానికి కూడా అనుమతి నిరాకరించింది. దీంతో ఐస్‌లాండ్‌కు వెళ్లే క్రమంలో రాష్ట్రపతికి సైతం ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రక్యాంపుపై దాడులు చేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్‌లోని ఎయిర్ స్పేస్ లో భారత విమానాలు ప్రయాణించేందుకు వీలు లేదంటూ పాక్ ఆంక్షలు విధించింది.