Most Expensive Fruit: సూర్యకాంతిలో పెరిగే పండు..కిలో రూ.రూ.20 లక్షలు
గ్రీన్ హౌస్ లో సూర్యకాంతిలో పెరిగినే అరుదైన పండు. ధర కిలో రూ.20 లక్షలు.

Most Expensive Fruit Yubari Melon (1) (1)
Most Expensive Fruit Yubari Melon: ఒక్క మామిడి పండు ధర రూ.12 వేలు. ఒక్క కొబ్బరి కాయ ధర రూ.605 లక్షలు, ఒక్క ద్రాక్ష గుత్తి ధర రూ.30వేలు ఇలా ఎన్నో పండ్ల ధరల గురించి తెలుసుకుని వామ్మో…ఇంత రేటా? కొనగలమా? తినగలమా? అసలు వాటిని చూడనైనా చూడగలమా? అని అనుకుని ఉంటాం. అటువంటిదే మరో అరుదైన పండు. ఈ పండు అరుదైనది అని ఎందుకు అంటున్నామంటే ఈ పండును పండిచే పద్ధతి చాలా చాలా ప్రత్యేకమైనది. మరి ఇంత ప్రత్యేకంగా పండిస్తున్నారు అంటే దాని ధర కూడా భారీగానే ఉంటుంది అనే అనుమానం రానే వస్తుంది.నిజమే..ఈ పండు కిలో అక్షరాలా రూ. 20 లక్షలు..!!
Read more : 1 coconut Rs 6.5 lakh : ఒక్క కొబ్బరికాయ ధర రూ.6.5 లక్షలు..!
ఈ పండు మనకు బాగా తెలిసిన పండే. కానీ ధర మాత్రమే చుక్కల్లో ఉంటుంది. మరి దీని ధరకు తగినట్లే టేస్టు కూడా ఉంటుందంటున్నారు దీన్ని పండించే నిపుణులు. ఇంతకీ ఆ పండు పేరు చెప్పనేలేదు కదూ..‘పుచ్చకాయ’. అలాంటిలాంటి పుచ్చకాయ కాదిది..జపాన్‌లోని యుబారి అనే పుచ్చకాయ. దీన్ని పండించే విధానం చాలా ప్రత్యేకం. గ్రీన్ హౌస్ లో సూర్యరశ్మిలో పెరుగుతుందీ పండు..!! దీన్ని మనం కర్భూజా అని అంటాం. పుచ్చకాయ జాతికి చెందినది.అందుకే దీన్ని వాటర్ మెలన్ అంటారు. అంటే పుచ్చకాయ అని కూడా అంటారు.
Read more : Japanese Grapes: ఒక్క ద్రాక్ష గుత్తి రూ.30వేలు.. వేలం వేసి మరీ అమ్మకం
జపాన్‌లోని గ్రీన్ హౌసుల్లో పండించే యుబారి అనే పుచ్చకాయ ప్రపంచలోనే అత్యంత ఖరీదైన పండుగా గుర్తింపు పొందింది. ఈ పండును కొనే డబ్బులతో ఎకరం పొలం కొనుక్కోవచ్చు. కానీ యుబారి పుచ్చకాయను కొనలేం కదా? అంటారు దీన్ని పండించే నిపుణులు. ధనవంతులు తప్ప సామాన్యులకు అందనంత ఖరీదైన ఈ పండు యుబారి పుచ్చకాయ ధర లక్షల్లో ఉంటుంది.
ఈ యుబారీ పండు స్టాటింగే రేటే సుమారు రూ.20 లక్షలు ఉంటుంది. అందుకే దీన్ని తినాలనే కోరికగలవారికి. రెస్టారెంట్ యజమానులకు కోసం ఈ పండును చిన్న చిన్న సైజుల్లో పండిస్తుంటారు. కిలో పండు ధర రూ.20 లక్షలు. జపాన్‌లోని యుబారి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరుగుతుంది. గ్రీన్‌హౌస్ లోపల సూర్యకాంతిలో ఈ పండును పెంచుతారు. ఎండగా ఎక్కువగా వస్తే ఈ పండ్లకు తెరలు కట్టేస్తారు. పండ్లను ప్రతీ నిమిషం పరిశీలిస్తుంటారు.
Read more : VIP Tree :ఈ చెట్టు నుంచి ఒక్క ఆకు రాలినా అధికారుల కంటిమీద కునుకు ఉండదు..!!