1 coconut Rs 6.5 lakh : ఒక్క కొబ్బరికాయ ధర రూ.6.5 లక్షలు..!

ఒకే ఒక్క కొబ్బరి కాయ రూ.6.5 లక్షలకు అమ్ముడైన ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఆ కొబ్బరి కాయ ప్రత్యేక ఏంటీ? ఎందుకు అంత ధర పెట్టి కొన్నారంటే..

1 coconut Rs 6.5 lakh : ఒక్క కొబ్బరికాయ ధర రూ.6.5 లక్షలు..!

1 Coconut Rs 6.5 Lakh

One coconut Rs 6.5 lakh : కొబ్బరికాయ. హిందువులకు అత్యంత పవిత్రమైనదీ..ప్రత్యేకమైనదీకూడా. ఏ శుభకార్యం మొదలుపెట్టాలన్నా కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. అటువంటి కొబ్బరికాయ ధర ఎంతుంటుంది? రూ.20లు మహా అయితే రూ.50లు ఉంటుంది.కానీ ఓ కొబ్బరికాయ ధర మాత్రం ఏకంగా రూ.6.5 లక్షలు. ఏంటీ ఆరున్నర లక్షలా? ఈ ధర పెడితే ఒక్క కొబ్బరికాయ ఏంటీ ఏకంగా కొబ్బరి తోటే కొనొచ్చు అంటారా?మరి అంత ధర పెట్టి ఆ కొబ్బరికాయను ఎవరు కొన్నారు? ఎందుకు కొన్నారు? ఆ కొబ్బరికాయ ప్రత్యేక ఏంటీ అనే అనుమానాలు వచ్చే తీరుతాయి. ఓ పండ్ల వ్యాపారి రూ.6.5లక్షలకు కొన్న ఆ నారికేళ ఫలం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..

Read more : Rare Falcon : ఈ గద్ద ధర రూ.3.4 కోట్లు!!

అది కర్ణాటక రాష్ట్రంలోని బాగ‌ల్‌కోట్ జిల్లా. ఆ జిల్లాలో చిక్క‌ల‌కీ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 12 వ శ‌తాబ్దంలో నిర్మించిన మ‌లింగ‌రాయ దేవుడి గుడి ఉంది. ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైనది. శక్తివంతమైనది అని భక్తులు నమ్ముతారు. ఈ దేవాలయంలో ఉండే పరమ శివుడి వాహనం అయిన నందిని మలింగరాయ అని పిలుస్తారు. ఈ నంది విగ్రహం చాలా శక్తివంతమైనదని భక్తులు నమ్ముతారు. ఈ మలింగ‌రాయ‌డి ద‌గ్గ‌ర ఒక కొబ్బ‌రికాయ‌ను ఉంచి.. దానికి సంవ‌త్స‌రం మొత్తం పూజ‌లు చేసి.. ప్ర‌తి సంవ‌త్స‌రం శ్రావ‌ణ మాసం ముగింపు సంద‌ర్భంగా దాన్ని వేలం వేస్తారు దేవ‌స్థాన క‌మిటీ సభ్యులు. ఆ కొబ్బరికాయను వేలంలో దక్కించుకోవటానికి ఎంతోమంది ప్రముఖులు, వ్యాపారులు పోటీ పడతారు. వినాయక చవితి ఉత్సవాల్లో మన హైదరాబాద్ నగర పరిధిలోని బాలాపూర్ గణేషుడు లడ్డూని దక్కించుకోవటానికి పోటీ పడినట్లుగా అన్నమాట.

Rear moreiPhone 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు!

ఈ మలింగరాయ (నంది విగ్ర‌హం) మీద ఉంచి ఆ కొబ్బ‌రికాయ‌కు పూజ‌లు చేస్తారు. విశిష్ట పూజ‌లు అందుకున్న ఆ కొబ్బ‌రికాయ ఎవ‌రి ఇంట్లో ఉండే ఆ ఇంట్లో అన్నీ శుభాలు క‌లుగుతాయ‌ని.. వాళ్ల‌కు అంతా మంచే జ‌రుగుతుంద‌ని స్థానికుల వారి న‌మ్మ‌కం. స్థానికులే కాకుండా ఈ కొబ్బరికాయను వేలంలో దక్కించుకోవానికి ఎంతోమంది వస్తుంటారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఆ కొబ్బ‌రికాయ‌ను వేలం వేస్తుంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ కొబ్బరికాయను విజయపుర జిల్లాకు చెందిన మ‌హ‌వీర్‌ హర్కే అనే ఓ పండ్ల వ్యాపారి భారీ ధరకు కొన్ని అందరిని ఆశ్చర్యపోయేలా చేశాడు. సాధారణంగా ప్రతి సంవత్సరం మలింగరాయ మీద పెట్టి పూజించిన కొబ్బరికాను వేలం వేస్తే..10 వేల నుంచి 15 రూపాయ‌లకు పాడుకునేవారట. కానీ ఈ ఏడాది మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఆ కొబ్బరికాయను మ‌హ‌వీర్‌ భారీ ధరకు పాడుకుని సొంతం చేసుకున్నాడు.

Read more : Bigger Gift – Better Dinner: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి విందు

ఈ సంవ‌త్స‌రం మాత్రం ఈ కొబ్బరికాయను దేవుడి పేరుతో రూ.1000 లకు ప్రారంభించారు. అలా ఆ కొబ్బరికాయను దక్కించుకోవటానికి వేలంలో ఎంతోమంది పాల్గొన్నారు. అలా ఎప్పుడు లేని విధంగా రూ.ల‌క్ష దాటింది. ఆ తరువాత అలా అలా వేలం ధర పెరుగుతు..పెరుగుతు.. 3 ల‌క్ష‌లు కూడా దాటింది.ట‌. కానీ ఆ మహిమగల కొబ్బరికాయను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న వ్యాపారి మ‌హ‌వీర్ ఏకంగా 6.5 లక్ష‌లు ఇస్తాన‌ని చెప్ప‌ి వేలాన్ని ముగించాడు. అలా ఆ కొబ్బ‌రికాయ మహావీర్ కు ద‌క్కింది.

వేలం పూర్తి అయ్యాక..చాలామంది మహావీర్ ను పిచ్చోడిలా చూశాడరట. కొంతమంది సన్నిహితులైతే మొహమ్మీదే..‘నీకేమైనా పిచ్చా.. ఆ కొబ్బ‌రికాయ కోసం అన్ని డ‌బ్బులు పెడతావా?’తిట్టార‌ట‌. కానీ.. మ‌హ‌వీర్ మాత్రం ‘‘డబ్బులు పెద్ద విషయం కాదు..దేవుడి మీద ఉన్న భ‌క్తి, న‌మ్మ‌కం అనేది చాలా ముఖ్యం..అనీ..ఆ దేవుడి కరుణ నామీద ఉంది కాబట్టే నాకు ఆ కొబ్బరికాయ దక్కింది’అని సంతోషం వ్యక్తం చేశాడు. దానికి మహావీర్ ఓ కారణం కూడా చెప్పాడు.

చాలా రోజుల కిందట నాకు ఆరోగ్యం బాగాలేదు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. దీంతో నా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అప్పుడు నేను మ‌లింగ‌రాయ దేవుడికి మొక్కుకున్నాను..ఆ తరువాత నా అనారోగ్య సమస్యలతో పాటు నా వ్యాపార సమస్యలు కూడా తీరిపోయాయి…అటువంటి స్వామి విశిష్టపూజలు అందుకున్న కొబ్బరి కాయ కోసం ఇంత డబ్బులు పెట్టాను..కానీ డబ్బులు పెద్ద విషయం కాదు..ఆ మలింగ రాయుడు దయ ఉంటే ఇంతకు ఇంతా సంపాదించుకోవచ్చు..ఆ డబ్బుతో మలింగ రాయుడు దేవాలయానికే కదా ఉపయోగించేది అని చెప్పాడు. కాగా..కొబ్బ‌రికాయ వేలం ద్వారా వ‌చ్చే డ‌బ్బుల‌తో గుడిని అభివృద్ధి చేస్తామ‌ని ఆల‌య క‌మిటీ తెలిపింది.