Most expensive gold coin : క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్ధం ముద్రించిన గోల్డ్ కాయిన్.. ఖరీదు ఎన్ని కోట్లు తెలుసా?

ఆ బంగారు నాణెం ఖరీదు అక్షరాల రూ.192 కోట్ల రూపాయలు. క్వీన్ ఎలిజబెత్ II మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె గౌరవార్ధం ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ నాణెం ముద్రించింది.

Most expensive gold coin : క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్ధం ముద్రించిన గోల్డ్ కాయిన్.. ఖరీదు ఎన్ని కోట్లు తెలుసా?

Most expensive gold coin

Updated On : September 9, 2023 / 12:36 PM IST

Most expensive gold coin : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు నాణెం క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్ధం ఆమె మొదటి వర్థంతి సందర్భంలో ఆవిష్కరించారు. ఈ కాయిన్ ఖరీదు అక్షరాల రూ.192 కోట్ల రూపాయలు.

NTR Rs 100 Coin: ఎన్టీఆర్ రూ.100 నాణెం కొనుగోలుకు ఆసక్తి చూపిన అభిమానులు.. తొలిరోజు ఎన్ని నాణేలు విక్రయాలు జరిగాయంటే..

దివంగత క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు నాణెం ఆవిష్కరించారు.  ఈ నాణెం దాదాపు 4 కిలోల బంగారం, 6,400 కంటే ఎక్కువ వజ్రాలతో తయారు చేసారు. ఈ నాణెం విలువ సుమారు $23 మిలియన్లు (భారతీయ కరెన్సీలో రూ.192 కోట్లు) గా అంచనా వేశారు. లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన ఈ నాణేన్ని క్వీన్స్ మరణించిన ఒక సంవత్సరం తరువాత ఆమె వర్ధంతి సందర్భంగా విడుదల చేసారు.

75 Rupees coin: రూ.75 నాణెం కావాలంటే ఎలా?
నాణెం 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసంతో ఉంది. మధ్య నాణెం 2 పౌండ్ల కంటే ఎక్కువ బరువు ఉంది. దాని చుట్టూ ఉన్న చిన్నవి ఒక్కొక్కటి 1 ఔన్స్ బరువుతో ఉన్నాయి. కిరీటాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేసారు. వజ్రాలను చాలా శ్రమతో కత్తిరించారట. ఇక నాణెం అంచుల చుట్టూ  ‘వయసుతో అనుభవం వస్తుంది.. దానిని సరిగ్గా ఉపయోగిస్తే పుణ్యం అవుతుంది’ అంటూ క్వీన్ కోట్‌లను కూడా రాసారు. ఈ విషయాల్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పేర్కొంది. అంతే కాదు ఈ నాణేల ఫోటోలను తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.