పార్లమెంట్ లో Porn చిత్రాలను చూసిన MP

Parliament in Thailand : ప్రజల కష్టాలు, సమస్యలు తీర్చేందుకు రాజ్యంగబద్ధమైన పరిష్కారాలు చూపించే అత్యున్నత వ్యవస్థలు ప్రతి దేశంలో ఉంటాయి. పార్లమెంట్ కు ఎంపికైన వారు..ప్రజలు ఎదుర్కొంటున్న..సమస్యలను ప్రస్తావించి..చర్చించి..పరిష్కారం చూపించే విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
కానీ..ఓ ఎంపీ మాత్రం..ఇవేమీ పట్టించుకోలేదు. ఏకంగా పోర్న్ చిత్రాలు చూస్తూ..మీడియాకు చిక్కారు. ఇదంతా థాయిలాండ్ లో చోటు చేసుకుంది.
https://10tv.in/maid-makes-her-boy-friend-create-fake-fb-profile-account-of-employer-posts-her-number-obscene-messages/
థాయిలాండ్ లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎంపీ రొనాథెప్ అనువత్ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి పోర్న్ చిత్రాలు చూడడం కనిపించింది. ప్రెస్ గ్యాలరీలో ఉన్న మీడియా కెమెరామెన్లు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. అత్యంత జుగుప్సాకరంగా ఉన్నట్లు సమాచారం.
దీనికి సంబంధించిన వీడియోలు బయటకు పొక్కాయి. దీంతో సదరు ఎంపీ రొనాథెప్ తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతంగ వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలాంగ్ ప్రచారత్ కి చెందిన ఎంపీ రొనాథెప్ చోన్‌బురీ ప్రావిన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పార్లమెంట్‌లో ఓ ఎంపీ పోర్న్ చూస్తూ పట్టుబడటం ఇది తొలిసారేం కాదు. 2012లో బ్యాంకాక్‌కు చెందిన ఎంపీ బంటద్‌తన్ పార్లమెంట్ సమావేశాల్లో తన మొబైల్ ఫోన్లో పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.