Strange Problem : కెనడాలో అంతుచిక్కని వింత వ్యాధి..ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులు

ఓ పక్క కరోనాతో ప్రపంచమంతా సతమతమైపోతుంటే కెనాడాలో మరోవింత వ్యాధి కలవరపరుస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. కెనడాలో చాలామంది ప్రజలకు నిద్రపట్టటంలేదట. అంతేకాదు కండరాల బలహీనత, వింత వింత భ్రమలు, కష్టపడి నిద్రపోతే పీడకలలు భయపెట్టేస్తున్నాయట. నిద్రలేమి,కండరాల బలహీనత, ఆందోళన, పీడకలలు వంటి లక్షణాలతో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో కెనడాలో పెరుగుతోంది.

Strange Problem : కెనడాలో అంతుచిక్కని వింత వ్యాధి..ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులు

Strange Problem (1)

Strange problem in canada 48 ceses recorded ఓ పక్క కరోనాతో ప్రపంచమంతా సతమతమైపోతుంటే కెనాడాలో మరోవింత వ్యాధి కలవరపరుస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. కెనడాలో చాలామంది ప్రజలకు నిద్రపట్టటంలేదట. అంతేకాదు కండరాల బలహీనత, వింత వింత భ్రమలు, కష్టపడి నిద్రపోతే పీడకలలు భయపెట్టేస్తున్నాయట. నిద్రలేమి,కండరాల బలహీనత, ఆందోళన, పీడకలలు వంటి లక్షణాలతో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో కెనడాలో పెరుగుతోంది. ముఖ్యంగా కెనడాలోని న్యూబ్రన్స్‌విక్‌ ప్రావిన్స్‌లో ఈ వింత వ్యాధి బాధతులు ఎక్కువగా ఉన్నారు. అటువంటి వింత లక్షణాలతో ఇప్పటివరకు 48 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఈ వింత లక్షణాలకు సంబంధించి ఎటువంటి కారణాలు సీనియర్ డాక్టర్ల కూడా అంతు చిక్కటంలేదు. దీంతో బాధితులకు ఎటువంటి చికిత్స చేయాలి?ఎటువంటి కౌన్సెలింగ్ చేయాలో కూడా అర్థం కావట్లేదట.

ఈ లక్షణాలకు గల కారణం ఏమిటనేది సీనియర్ డాక్టర్లకు గానీ..ఆఖరిని న్యూరాలజీ సైంటిస్టులకు కూడా అంతుచిక్కడం లేదు. దీంతో సైంటిస్టులు ఈ వింత వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నారు. దీన్ని త్వరగా గుర్తించాలని పరిశోధనలకు కొనసాగిస్తున్నారు. గత ఆరు సంవత్సరాల క్రితం ఈ వింత వ్యాధిని మొదటిసారిగా గుర్తించారు. ఈ వింత వ్యాధితో గత ఆరేళ్లల్లో ఆరుగురు మరణించారు. మరణించి ఆరుగురి మెదడులపై పరిశోధనలు నిర్వహించినా దీనికి తగిన కారణాలు ఏమిటనేది తెలియలేదు. కాగా పీడ కలలు వస్తున్నవారు చనిపోయిన తమ బంధువులు కలలో కనిపిస్తున్నారని..అంటున్నారట.

ఈ వింత వ్యాధి సెల్‌ఫోన్‌ టవర్ల వల్లే ఇలా జరుగుతుందని కొందరు, కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటమని మరికొందరు భావిస్తున్నారు. అదేం కాదు వాతావరణంలో వస్తున్న మార్పులే ఈ వింత వ్యాధికి కారణమని ఇంకొందరు భావిస్తున్నారు. అదేంకాదు..ఇది జెనిటిక్ వల్ల వస్తుందంటుంటే..లేదా చేప తినడం వల్ల లేదా లేడి మాంసం తినడం వల్ల వస్తుందని మరికొందరు ఎవరికి తోచినట్లుగా వారు అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకూ ఈ వ్యాధికి సంబంధించి ఎటువంటి కారణాలు తెలియరాలేదు. కానీ కారణాలు తెలసుసుకోవటానికి సైంటిస్టులు వివిధ రకాలుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.