Solar Storm : భూమిని తాకనున్న సౌర తుపాన్..గంటకు 16 లక్షల కిమీ వేగంతో భూమి వైపు

సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు.

Solar Storm : భూమిని తాకనున్న సౌర తుపాన్..గంటకు 16 లక్షల కిమీ వేగంతో భూమి వైపు

Solar Storm

Updated On : July 19, 2022 / 11:57 AM IST

solar storm : మరికొద్దిగంటల్లో శక్తివంతమైన సౌర తుపాను భూమిని తాకబోతోందని నాసా ప్రకటించింది. దాని ప్రభావంతో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశముందని పేర్కొంది. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు.

తొలుత నిన్న తాకుందని అంచనా వేసినా.. ఆ తర్వాత ఇవాళ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని నిర్దారించారు. దీనివల్ల ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లోని ప్రజలు అందమైన ఖగోళ కాంతిని చూడగలరని తెలిపారు. సౌర తుపాను ప్రభావంతో భూగోళపు బాహ్య వాతావరణం వేడెక్కే అవకాశముందని శాస్త్రవేత్తలు వివరించారు.

Solar Cyclone: దూసుకొస్తున్న సౌర తుపాన్.. కమ్యూనికేషన్ సిస్టంపై ఎఫెక్ట్

ఈ ప్రభావం ఉపగ్రహాలపై పడి.. GPS నేవిగేషన్‌, మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయే ముప్పుందని హెచ్చరించారు. మానవ ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.