అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్‌కి ఏమైంది? ఇలా అయిపోయారేంటి? నాసా ఏమంది?

సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ ఫొటోల్లో తేడాలు ఉండడం, వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్న ప్రచారంపై నాసా అధికారికంగా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.

అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్‌కి ఏమైంది? ఇలా అయిపోయారేంటి? నాసా ఏమంది?

Updated On : November 7, 2024 / 6:06 PM IST

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరోగ్యపర సమస్యలు తలెత్తాయని ఆందోళన నెలకొంది. ఎనిమిది రోజుల మిషన్‌ కోసం ఐఎస్‌ఎస్‌ వెళ్లిన సునీతా విలియమ్స్‌ 2024 జూన్ నుంచి ఇప్పటివరకు తిరిగి రాలేదన్న విషయం తెలిసిందే.

బోయింగ్‌ స్టార్‌లైనర్‌ ద్వారా వెళ్లిన సునీత, బుచ్ విల్మోర్ చివరకు అందులో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల అక్కడే ఉండిపోయారు. వారిద్దరిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దాదాపు ఆరు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్‌ ఉండటం వల్ల ఆమె అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది.

ఆమె అనారోగ్యానికి గురయ్యారన్న ప్రచారాన్ని బలపర్చుతోంది ఓ ఫొటో. ఇందులో ఆమె బరువు తగ్గినట్లుగా కనపడుతున్నారు. ఆమె బుగ్గలు లోపలికి వెళ్లి కనపడుతున్నాయి. సునీతా విలియమ్స్‌ పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఫొటోలో బలహీనంగా కనిపిస్తున్నట్లు యూఎస్‌ వైద్యుడు వినయ్ గుప్తా కూడా అన్నారు.

సునీతా విలియమ్స్‌ కు స్పేస్‌ ఎనీమియా వచ్చే ముప్పు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అంటే ఆమె శరీరంలో సమతుల్యతను లేకుండా చేస్తూ ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గిపోతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, ఆమె హృదయ పనితీరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన నెలకొంది.

నాసా ఏమంటోంది?
సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ ఫొటోల్లో తేడాలు ఉండడం, వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్న ప్రచారంపై నాసా అధికారికంగా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్ సురక్షితంగానే ఉన్నారని నాసా తెలిపింది. నాసా ప్రతినిధి జిమీ రస్సెల్ స్పందిస్తూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగాములందరికీ సాధారణ వైద్య పరీక్షలు చేస్తారని, ఫ్లైట్ సర్జన్లు వారిని పర్యవేక్షిస్తారని చెప్పారు. సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.

iPhone 14 Pro Max : ఐఫోన్ 14 ప్రో మాక్స్ బ్యాటరీ పేలుడు.. మహిళకు తీవ్ర గాయాలు.. ఆపిల్ ఏమన్నదంటే?