భయంకరమైన గుమ్మడికాయ: సూర్యుడి ఫొటో ట్వీట్ చేసిన నాసా

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ అపురూప దృశ్యాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. పాత ఫొటో అయినా కొత్తగా ట్వీట్ చేసి ఆకట్టుకుంటుంది. ఓ గుమ్మడికాయ ఆకారంలో ఉన్న సూర్యుడి ఫొటో చూసేందుకు కొత్తగా ఎన్నో రెట్లు అధికంగా వెలుగులు జిమ్ముతూ ఉంది.
ఈ ఫొటో పోస్టు చేస్తూ ఇది ఏదో ప్రమాదకరమైన లాంతర్ కాదు. ఇది సూర్యుడు. నిత్యం సూర్యుడినే గమనిస్తున్న నాసాకు సంబంధించిన సోలార్ డైనమిక్ అబ్‌సర్వేటరీ ఈ చిత్రాన్ని 2014లో తీసింది. సూర్యుడి చుట్టూ ఉండే లేయర్లు ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.
కరోనా భాగంలో అధికంగా ఉండే బలమైన అయస్కాంత క్షేత్రాల కారణంగా సూర్యుడు వెలిగిపోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 73వేల 193 ఆంగ్‌స్ట్రాంగ్‌ల యూనిట్ల అతి నీలలోహిత కిరణాల సహాయంతో ఈ ఇమేజ్ అంత కాంతివంతంగా వచ్చినట్లు నాసా వివరించింది.
బంగారం, పసుపు వర్ణాలు రావడానికి కారణం ఆ ఫొటోలో వేవ్ లెంగ్త్ 171, 193 యాంగ్‌స్ట్రామ్‌లుగా ఉండటమేనని ఈ కారణంగా హాల్లోవెన్ లా కనిపిస్తుందని నాసా వెల్లడించింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మిశ్రమ స్పందన వస్తోంది. సూర్యూడు కూడా అందంగా ఉన్నాడని, భయం వేస్తోందని, గుమ్మడికాయలా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
No, that’s not a fiery jack-o’-lantern ??. It’s the Sun!
Our @NASASun Solar Dynamics Observatory captured this ultraviolet image in 2014, showing active regions on our home star. #Halloween19
Download in hi-res: https://t.co/731LNTG6Ui pic.twitter.com/RWIETuusYo
— NASA, but Sp?️?️ky (@NASA) October 28, 2019
Is the universe celebrating halloween? Just kiddin.
— Mister You (@Mark_Ruben_Ucag) October 29, 2019
That’s one mean star.
— Max Lange (@Rocketist) October 29, 2019