Jupiter: బృహస్పతిపై శక్తిమంతమైన 2 తుపానులు.. అబ్బురపరుస్తున్న ‘నాసా’ ఫొటో
అక్కడి వాతావరణం వల్ల సంభవించిన రెండు అతి పెద్ద శక్తిమంతమైన తుపానులు వాటర్‌కలర్ పెయింటింగ్‌లను పోలి కనపడుతున్నాయి.

Jupiter
NASA: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ బృహస్పతికి సంబంధించిన మరో ఫొటోను విడుదల చేసింది. సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహం బృహస్పతిని గురుగ్రహం అని కూడా అంటాం. గురుడిపై ఉన్న వాతావరణం వల్ల సంభవించిన రెండు అతి పెద్ద శక్తిమంతమైన తుపానులు వాటర్‌కలర్ పెయింటింగ్‌లను పోలి కనపడుతున్నాయి ఈ ఫొటోలో.
నాసా జునో మిషన్‌లోని జునోక్యామ్ ఈ ఫొటోను పెరిజోవ్ నుంచి 2021, నవంబరు 29న తీసింది. 50 డిగ్రీల 5 నిమిషాల ఉత్తర అక్షాంశం, 6,140 కిలోమీటర్లు ఎత్తు నుంచి జునోక్యామ్ ఈ ఫొటో తీసినట్లు నాసా వివరించింది. భూమి పరిమాణం కంటే గురు గ్రహ పరిమాణం 1,303 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
గురు గ్రహంలో హైడ్రోజన్, హీలియం విపరీతంగా ఉంటుందని నాసా తెలిపింది. బృహస్పతిపై పరిశోధనల కోసం అట్లాస్ వీ 551 (ఏవీ-029) రాకెట్ ద్వారా జ్యునో ప్రయోగాన్ని 2011లో నాసా విజయవంతంగా చేసింది. ఐదేళ్ల అనంతరం అది 2016, జులై 5న వ్యోమనౌక గురు గ్రహ ధ్రువ కక్ష్యలోకి ప్రవేశించింది.
గురు గ్రహానికి సంబంధించిన వివిధ ఫొటోలను నాసా ఇప్పటికే పలుసార్లు పోస్ట్ చేసి పలు వివరాలు తెలిపింది. నాసా ఇంతకు ముందు పోస్ట్ చేసిన ఫోటోలలోనూ.. గురు గ్రహంలో అత్యంత శక్తిమంతమైన తుపానులు కనపడ్డాయి. అవి కూడా వాటర్‌కలర్ పెయింటింగ్‌ను పోలి ఉన్నాయి.
View this post on Instagram