New Covid variant : మూడు దేశాల్లో కొవిడ్ బీఏ 2.86 కొత్త వేరియెంట్ వ్యాప్తి…యూఎస్ సలహా

ప్రపంచంలోని మూడు దేశాల్లో కొవిడ్ ఒమైక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొవిడ్-19కి కారణమయ్యే కొత్త వైరస్ వంశాన్ని ట్రాక్ చేసింది....

New Covid variant : మూడు దేశాల్లో కొవిడ్ బీఏ 2.86 కొత్త వేరియెంట్ వ్యాప్తి…యూఎస్ సలహా

New Covid variant

Updated On : August 19, 2023 / 6:37 AM IST

New Covid variant : ప్రపంచంలోని మూడు దేశాల్లో కొవిడ్ ఒమైక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) కొవిడ్-19కి కారణమయ్యే కొత్త వైరస్ వంశాన్ని ట్రాక్ చేసింది. ఈ వైరస్ మునుపటి కంటే అధికంగా వ్యాప్తి చెందుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Air Hostess : స్పైస్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌పై ప్రయాణికుడి వేధింపులు

యునైటెడ్ స్టేట్స్, డెన్మార్క్, ఇజ్రాయెల్‌ దేశాల్లో ప్రబలుతున్న ఈ కొత్త సబ్ వేరియెంట్ కు బీఏ.2.86 అని పేరు పెట్టారు. (New Covid variant BA.2.86) ఈ కొత్త వేరియెంట్ పర్యవేక్షిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్విట్టరులో పేర్కొంది. (US top health body issues advisory)

Pet Dogs Fight : ఓ మై గాడ్.. కుక్క కోసం గొడవ, ఇద్దరిని కాల్చి చంపేశాడు.. వీడియో వైరల్

ప్రస్తుతం ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న ఎక్స్‌బీబీ .1.5 కొవిడ్ వేరియంట్ లో 36 ఉత్పరివర్తనలు ఉన్నాయని హ్యూస్టన్ మెథడిస్ట్‌లోని డయాగ్నస్టిక్ మైక్రోబయాలజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్. ఎస్ వెస్లీ లాంగ్ వివరించారు. ఈ కొత్త వైరస్ టీకా నుంచి రోగనిరోధక ప్రతిస్పందనలను పరిశీలించాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా కొవిడ్‌తో పోరాడటానికి బూస్టర్‌లు ఇప్పటికీ సహాయపడతాయని డాక్టర్ లాంగ్ చెప్పారు.