కిడ్నీ ఆపరేషన్ : ఒకే పేరు వల్ల వచ్చిన తిప్పలు

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 06:45 AM IST
కిడ్నీ ఆపరేషన్ : ఒకే పేరు వల్ల వచ్చిన తిప్పలు

Updated On : November 28, 2019 / 6:45 AM IST

న్యూజెర్సీ లోని ఓ హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి అపరేషన్ లో జరిగిన పొరపాటు. ఓ రోగికి చేయాలిసిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను.. అదే పేరు మీద ఉన్న మరో రోగికి చేశారు. ఆ హాస్పిటల్ పేరు ‘విర్చువా అవర్ లేడీ ఆఫ్ లౌర్డెస్’. ఆపరేషన్ చేసిన తర్వాతి రోజు ఆ క్లీనిక్ బృందం లో ఓ వ్యక్తి ఈ రోగిని గుర్తించారు. 

అసలు విషయమిటంటే.. ఆ ఇద్దరు రోగులు ఒకటే పేరుతో ఉన్నారు. అంతేకాదు వారి ఇద్దరి వయసు కూడా సుమారుగా ఉండటంతో ఈ పొరపాటు జరిగిందని హాస్పిటల్ వాల్లు తెలిపారు. ఇక కిడ్ని మార్పిడి చేయాల్సిన 51ఏళ్ల  పేషంట్ ఆరు రోజుల తరువాత హాస్పిటల్ కు వచ్చింది. అంతేకాదు జరిగిన విషయమంతా.. ఆర్గాన్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నెట్‌వర్క్, న్యూజెర్సీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌ కు కూడా ఈ సంఘటనను ఆసుపత్రి నివేదించింది.

ఇక ప్రస్తుతం ఆ ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం బాగానే ఉందని హాస్పిటల్ అధికారులు తెలిపారు. హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ రెజినాల్డ్ బ్లేబర్  మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చే రోగుల జీవితాలపై మాకు తీవ్ర బాధ్యత ఉందన్నారు.