Omicron – Cyber attack: బీ కేర్ ఫుల్.. ఒమిక్రాన్నూ వదలని సైబర్ చీటర్లు.. క్లిక్ చేస్తే మొత్తం దోచేస్తారు..!
ఒమిక్రాన్ తో ప్రజలు పడుతున్న ఆందోళనను.. సైబర్ క్రిమినల్స్ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కొత్త మాల్వేర్ లను ఈ మెయిల్స్ కు పంపిస్తూ.. అడ్డంగా దోచేస్తున్నారు.
Omicron – Cyber attack: ఒమిక్రాన్ భయంతో అతిగా ఆందోళన పడుతున్నారా? ఆ పేరుతో ఏదైనా మెయిల్ వచ్చినా.. మెసేజ్ వచ్చినా కంగారు కంగారుగా క్లిక్ చేసేస్తున్నారా? ఓటీపీలు అడిగితే ఇచ్చేస్తున్నారా? అయితే.. బీ కేర్ ఫుల్. మీరు పడుతున్న ఆ ఆందోళనే.. మీ పాకెట్లు ఖాళీ చేసేయొచ్చు. అకౌంట్లలో పైసా లేకుండా చేసేయొచ్చు. మిమ్మల్ని నిలువునా దోచేయొచ్చు. ఫోర్టీగార్డ్ అనే.. సైబర్ సెక్యూరిటీ రీసర్చ్ సంస్థ.. ఈ విషయాన్ని వెల్లడించింది. సైబర్ క్రిమినల్స్ కు.. ఒమిక్రాన్.. ఓ వెపన్ గా మారిందన్న ఆందోళనకరమైన విషయాన్ని.. వెలుగులోకి తెచ్చింది.
ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగైదు అంతకన్నా కాదు. ఇప్పటికే.. 12 దేశాలు.. కొత్త మాల్ వేర్ బారిన పడ్డాయట. ఈ మెయిల్స్ ద్వారా రెడ్ లైన్ మాల్వేర్ ను పంపించి.. వాటితో నెటిజన్ల యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు అన్నీ దోచేస్తున్నారట. ‘Omicron Stats.exe’ పేరుతో వచ్చే ఈ లింక్ ను.. పొరబాటున కూడా క్లిక్ చేయొద్దని ఫోర్డీగార్డ్ రీసెర్చర్లు చెబుతున్నారు. ఈ మాల్ వేర్ తో సేకరించిన ఒక్కో యూజర్ సమాచారాన్ని.. కనీసం 10 డాలర్లకు అమ్మి సైబర్ క్రిమినల్స్ సొమ్ము చేసుకుంటున్నారని ఫోర్టీగార్డ్ తెలిపింది.
జనాల వీక్ నెస్ ను క్యాష్ చేసుకోవడంలో.. సైబర్ క్రిమినల్స్ ఎప్పుడూ అవకాశాల కోసం వెతుకుతుంటారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భయంతో ప్రపంచ జనాలు పడుతున్న టెన్షన్ ను.. హ్యాకర్లు ఇలా రెడ్ లైన్ మాల్వేర్ తో క్యాష్ చేసుకుంటున్నారట. ఈ మాల్వేర్ 2020లోనే వెలుగు చూసినా.. ఇప్పుడు ఒమిక్రాన్ పేరుతో హ్యాకర్లు విచ్చలవిడిగా నెటిజన్లను టార్గెట్ చేస్తున్నట్టు ఫోర్టీగార్డ్ చెప్పింది. ఈ విషయంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఈ మెయిల్స్ లో వచ్చే లింక్స్ ను ఆలోచించి క్లిక్ చేయాలని.. సూచిస్తోంది.
Read More:
Bhogi : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు
Train Derailed: రైలు ప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య