Train Derailed: రైలు ప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బికనీర్- గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరుకుంది.

Bikaner Guwahati Express Derailed
Bikaner Guwahati Express Derailed: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బికనీర్- గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరుకుంది. ఈ ఘటన డొమోహని వద్ద చోటు చేసుకోగా.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది రైల్వేశాఖ.
ఈ ప్రమాదంలో 45మందికి పైగా తీవ్ర గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే సేఫ్టీ కమిషన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
పట్నా నుంచి గౌహతి వెళుతున్న గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ ఉత్తర బెంగాల్‌లోని మైనాగురి – దోమోహని సమీపంలో 12 బోగీలు పట్టాలు తప్పగా వాటిలో ఆరు బోగీలు తలకిందులయ్యాయి.
ప్రమాదం తర్వాత బోగీల్లో ప్రయాణికుల హాహా కారాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. ఘటన జరిగిన చాలాసేపటికి బోగీ కిటికీల నుంచి ఒకొక్కరుగా కిందకు దూకుతున్న దృశ్యాలు కనిపించాయి.