Forbes List: వరుసగా నాలుగోసారీ శక్తివంతమైన మహిళగా నిలిచిన నిర్మలా సీతారామన్
ఈ జాబితాలో నిర్మలకు 36వ శక్తివంతమైన మహిళగా చోటు దక్కింది. ఆమె తొలిసారి 2019లో ఫోర్బ్స్ అంత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు. ఆ యేడాది 34వ ర్యాంకు దక్కింది. ఇక అనంతరం ఏడాది 2020లో 41వ స్థానం, అనంతరం 2021వ ఏడాది 37వ స్థానాలు వచ్చాయి. ఇక ఈసారి కూడా 100 జాబితాలో 36వ ర్యాంకు దక్కింది.

Nirmala Sitharaman, 5 Other Indians Among Forbes' 100 Most Powerful Women
Forbes List: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగో ఏడాది నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల్లో నిర్మల సహా మరో ఐదుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది. అయితే ఇందులో భారత్ తరపున నిర్మలానే ముందున్నారు.
ఈ జాబితాలో నిర్మలకు 36వ శక్తివంతమైన మహిళగా చోటు దక్కింది. ఆమె తొలిసారి 2019లో ఫోర్బ్స్ అంత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు. ఆ యేడాది 34వ ర్యాంకు దక్కింది. ఇక అనంతరం ఏడాది 2020లో 41వ స్థానం, అనంతరం 2021వ ఏడాది 37వ స్థానాలు వచ్చాయి. ఇక ఈసారి కూడా 100 జాబితాలో 36వ ర్యాంకు దక్కింది.
ఇక నిర్మలా సీతారామన్‌తో పాటు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజూందర్ షా, నైకా వ్యవస్థాపకులు ఫల్గుణి నాయర్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా, సెబీ ఛైర్‌పర్సన్ మధాబి పురి బచ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ సోమ మొండల్ ఈ జాబితాలో చోటు సంపాదించారు. పరపతి, మీడియా, ప్రభావం, ప్రభావిత రంగాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
MCD Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచింది.. కానీ సినిమా ఇంకా మిగిలే ఉంది