No extramarital affairs: వివాహేతర సంబంధాలు, విడాకులపై నిషేధాస్త్రం..చైనా కార్పొరేట్ కంపెనీ వినూత్న నిబంధన

చైనా దేశానికి చెందిన ఓ కార్పొరేట్ కంపెనీ తన ఉద్యోగులకు వినూత్న కొత్త నిబంధన విధించింది. తమ కంపెనీ ఉద్యోగులు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, లేదా విడాకులు తీసుకున్నా ఉద్యోగం నుంచి వారిని తొలగిస్తామని చైనా కంపెనీ ప్రకటించింది....

No extramarital affairs: వివాహేతర సంబంధాలు, విడాకులపై నిషేధాస్త్రం..చైనా కార్పొరేట్ కంపెనీ వినూత్న నిబంధన

వివాహేతర సంబంధం పెట్టుకుంటే...

Chinese firm rules No extramarital affairs : చైనా దేశానికి చెందిన ఓ కార్పొరేట్ కంపెనీ తన ఉద్యోగులకు వినూత్న కొత్త నిబంధన విధించింది. తమ కంపెనీ ఉద్యోగులు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, లేదా విడాకులు తీసుకున్నా ఉద్యోగం నుంచి వారిని తొలగిస్తామని చైనా కంపెనీ ప్రకటించింది. చైనాలోని జెజియాంగ్‌కు చెందిన ఒక కంపెనీ తమ ఉద్యోగులకు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, జీవిత భాగస్వామికి విడాకుల ఇవ్వడంపై నిషేధం విధించామని ప్రకటించింది.

Karnataka : ఇద్దరు భార్యల నుంచి భరణం కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి

భార్యాభర్తల మధ్య ప్రేమ లేక పోతే, వారి దాంపత్య జీవితం సాఫీగా సాగకపోతే ఉద్యోగులు పనిపై ఏకాగ్రత చూపించలేరని కంపెనీ పేర్కొంది. చైనా కంపెనీ ప్రకటించిన వివాహేతర సంబంధాల నిషేధం, విడాకుల నిషేధం ఉత్తర్వులు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఉద్యోగులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఉంపుడుకత్తెలను ఉంచుకోవడం, విడాకులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా పరిగణించి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కంపెనీ హెచ్చరించింది.

Mundra Port Work Resumes: తుపాన్ తర్వాత ముంద్రా పోర్టులో కార్యకలాపాలు ప్రారంభం..కరణ్ అదానీ ట్వీట్

తమ కంపెనీ ఉద్యోగులందరూ మూడు నోస్ నిబంధనలను పాటించాలని కోరింది. ‘‘అక్రమ సంబంధం ఉండకూడదు, ఉంపుడుగత్తెను ఉంచుకోరాదు, వివాహేతర సంబంధం పెట్టుకోరాదు,తన జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వకూడదనే నిబంధనలను అమలు చేస్తున్నామని కంపెనీ వివరించింది.

North India Extreme Heatwave: ఉత్తర భారతంలో వీస్తున్న వేడిగాలులు..98 మంది మృతి

ఈ నిబంధనలను ఎవరైనా ఉద్యోగులు ఉల్లంఘిస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని కంపెనీ తెలిపింది.‘‘స్థిరమైన, సామరస్యపూర్వకమైన కుటుంబం వల్ల పనిలో ఉత్పాదకత పెరుగుతుందని, అందుకే ఈ నాలుగు అంశాలపై ఉద్యోగులకు నిషేధం విధించినట్లు కంపెనీకి చెందిన ఓ అధికారి చెప్పారు. కంపెనీ విధించిన ఈ వినూత్న నిబంధనలపై చైనా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది.