Nobel Prize 2023: వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి

న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లకు సంబంధించిన పరిశోధనల్లో కొత్త విషయాలను కనుగొన్నారు.

Nobel Prize 2023: వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి

Katalin Kariko, Drew Weissman

Updated On : October 2, 2023 / 5:26 PM IST

Katalin Kariko-Drew Weissman: వైద్య శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ పురస్కారం దక్కింది. కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు నోబెల్‌ పురస్కారం అందజేయనున్నట్లు స్వీడన్‌లోని ఆ కమిటీ ప్రకటన చేసింది. కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ కరోనా సమయంలో ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కృషి చేశారు.

Katalin Kariko

న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లకు సంబంధించిన పరిశోధనల్లో కొత్త విషయాలను కనుగొన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం తరఫున ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో ప్రతి ఏడాది నోబెల్ బహుమతి ప్రకటిస్తారు. గత ఏడాది ఈ అవార్డును స్వాంటె పాబో స్వీకరించారు.

Drew Weissman

హోమినిన్‌ జన్యువులకు సంబంధించి ఆయన పరిశోధనలు చేశారు. నేటి నుంచి వరుసగా గురువారం వరకు నోబెల్ బహుమతుల ప్రకటనలు ఉంటాయి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, అర్థ శాస్త్రంలో నోబెల్ అసెంబ్లీ పురస్కారాలు ప్రకటిస్తుంది.

UNFPA : ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు స్త్రీల ఆయుర్దాయం ఎక్కువట