100ఏళ్ల వృద్ధురాలి బర్త్ డే కోరిక విని.. బేడీలు వేసి జైల్లో పడేశారు

100 సంవత్సరాలు బ్రతికుండి..పుట్టిన రోజు జరుపుకోవటమంటే మాటలు కాదు.అంతకాలం బ్రతికి ఉండటం చాలా పెద్ద విషయం. అలా పుట్టిన రోజు జరుపుకుంది నార్త్ కరోలినాకు చెందిన 100 సంవత్సరాల వృద్ధురాలు. ఆమె పేరు రుత్ బ్రయాంట్. ఆమె ఓ వృద్ధాశ్రమంలో ఉంటోంది. బామ్మగారి 100వ పుట్టిన రోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న తోటి వృద్ధులంతా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. థాంక్యూ సోమచ్..అని బదులిచ్చింది రుత్ బ్రయాంట్.
ఇన్ని సంవత్సరాలుగా నీకేమైనా కోరికలున్నాయా? అని అడిగారు తోటి వృద్ధ ఫ్రెండ్స్. వృద్ధాశ్రమ నిర్వాహకులు. దానికి ఆమె చాలా చాలా ఉత్సాహం..హా..ఉంది..ఇప్పటివరకూ నాకు ఆ కోరిక తీరనే లేదు. తీరుతుందనే ఆశకూడా లేదు అంటూ ఉస్సూరుమంటూ చెప్పింది. దానికి వారంతా ఏమిటీ నీ కోరిక చెప్పు.. చెప్పూ.. అంటూ అడిగారు.
దానికామె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారంతా!! ఏంటీ ఇంకోసారి చెప్పు అని మరోసారి అడిగారు.. రుత్ బ్రయాంట్ మళ్లీ అదే చెప్పింది. ఈసారి వాళ్లకు నోట మాట రాలేదు..బిగుసుకుపోయారు. నోళ్లు వెళ్లబెట్టారు.ఇంతకీ ఆమె కోరిక ఏమిటో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే..‘‘నాకు ఎప్పటి నుంచో జైలులో ఖైదీలా గడపాలనుంది’’అదికూడా చేతులకు బేడీలు వేయించుకుని అంటూ చెప్పింది!!. ఈ విషయాన్ని వృద్ధాశ్రమ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. అది విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. నోళ్లు వెళ్లబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఓ పోలీసు అధికారి రుత్ బ్రయాంట్ కోరిక తీర్చడానికి ముందుకొచ్చాడు.
వాకర్ సహాయంతో నడుస్తున్న ఆమెను సాధారణ ఖైదీలలాగే చేతికి బేడీలు వేసి.. పోలీసు జీపులో కూర్చోబెట్టారు. పోలీస్ సైరన్, వ్యాన్ లైట్ల వెలుగులతో ఆమెను జైలుకు తరలించారు. తరువాత జైలులో ఖైదీలు ఉండే సెల్‌లో కొద్దిసేపు ఉంచారు. సెల్ లో కూర్చున్న ఆమె చిన్నపిల్లలా తెగ సంబరపడిపోయింది. అలా కొన్ని గంటలు జైలులో ఉంచి తిరిగి ఆశ్రమానికి చేర్చాలనుకున్నారు. అలా జైలునుంచి తిరిగొచ్చేటప్పుడు పోలీసులు ఆమె చేతిలో ‘పర్సన్ కౌంటీ జైల్’ అని ప్రింట్ ఉన్న ఓ ఆరెంజ్ టీషర్ట్ ఇచ్చి తిరిగి ఆశ్రమానికి తీసుకొచ్చి దించారు.
వృద్ధాశ్రమానికి తిరిగొచ్చిన తర్వాత రుత్ బ్రయాంట్..చాలా చాలా సంతోషంగా చేసుకుంది. కేక్ కట్ చేసింది. అందరికీ పంచింది. తాను కూడా తిన్నది.ఇన్నాళ్లకు నా కోరిక ఈ 100 సంవత్సరాల పుట్టిన రోజున నెరవేరింటూ తెగ సంబరపడిపోయింది రుత్ బ్రయాంట్!!
See Also | అతడు-ఆమె- ఓ రైలు: నమ్మించి పెళ్లి చేసుకుని తక్కువ కులందానివని పొమ్మన్నాడు