Woman Spits : మాస్క్ ధరించలేదని గెంటేసినందుకు గార్డ్ పై ఉమ్మేసిన మహిళ

మాస్క్ ధరించలేదని షాపు నుంచి గెంటేసిన ఓ సెక్యూర్టీ గార్డుపై మహిళ ఉమ్మేసింది. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మరికొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

Woman Spits : మాస్క్ ధరించలేదని గెంటేసినందుకు గార్డ్ పై ఉమ్మేసిన మహిళ

Woman Spits

Updated On : June 7, 2021 / 6:46 PM IST

Woman Spits Harrods Security Guard : కరోనా వైరస్ తో ఎలాంటి భయాందోళనలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తం వైరస్ తో వణికిపోతోంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే..వ్యాక్సిన్ వేసుకున్నా..కరోనా నియమాలు, నిబంధనలు పాటించాలని ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు చెబుతున్నాయి. అయితే..కొంతమంది వీటిని బేఖాతర్ చేస్తున్నారు. ఇలాగే ఓ ఘటన జరిగింది. మాస్క్ ధరించలేదని షాపు నుంచి గెంటేసిన ఓ సెక్యూర్టీ గార్డుపై మహిళ ఉమ్మేసింది. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మరికొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

లేత గోధుమ రంగు గల డ్రెస్ ధరించిన ఓ మహిళ సెక్యూర్టీ గార్డులతో గొడవ పడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. తాను ఏ తప్పు చేయలేదని ఆ మహిళ అరుస్తోంది. బలవంతంగా మహిళ దుకాణంలో ప్రవేశిస్తుండగా..అక్కడున్న సెక్యూర్టీ గార్డులు అడ్డుకున్నారు. మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు సెక్యూర్టీ గార్డులను నెట్టివేయడం కనిపిస్తోంది. ఈ సమయంలోనే..లేత గోధుమ రంగు గల డ్రెస్ ధరించిన మహిళ అమాంతం ఓ సెక్యూర్టీ గార్డుపై ఉమ్మేసి పరుగులు తీసింది.

వెంటనే ఇతర సెక్యూర్టీ గార్డులు ఆమెను పట్టుకోవడానికి రోడ్డు మీదకు పరుగెత్తారు. వారు చివరకు ఆమెను పట్టుకున్నారు. పోలీసులు అరెస్టు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మాస్క్ ధరించడానికి నిరాకరించడంతో సెక్యూర్టీ గార్డులు ఆమెను లోనికి అనుమతినివ్వలేదు. తమ స్టోర్ లో ఉన్న వారిని రక్షించడానికి భద్రతా బృందానికి శిక్షణ ఇవ్వబడుతుందని Harrods డిపార్ట్ మెంట్ ప్రతినిధి వెల్లడించారు.

Read More : Exams Cancel:10, 12 తరగతులకు పరీక్షలు రద్దు.