Novavax coronavirus vaccine రెడీ.. సేఫ్‌గా వాడుకోవచ్చు

COVID-19 తగ్గించేందుకు రెడీ అయిన వ్యాక్సిన్ నొవావ్యాక్స్ క్లినికల్ ట్రయల్ రిజల్ట్స్ లో పాజిటివ్ ఫలితాలు దక్కించుకుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ పెంచుతున్నట్లు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో రాసుకొచ్చారు. ఆగష్టు ఆరంభంలోనే దీని ఫలితాలు వెల్లడించింది కంపెనీ. ప్లాసెబో కంట్రల్‌డ్ ట్రయల్ లో భాగంగా గోల్డ్ స్టాండర్ట్ పద్ధతి అనుసరించి స్టడీ నిర్వహించారు.
మే నెలలో 131మంది వ్యక్తులకు సెలైన్ ద్వారా వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేశారు. 83మందిలో వ్యాక్సిన్ పనితనం కనిపించింది. శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్ మెరుగైంది. 25మందికి వ్యాక్సిన్ బూస్టింగ్ ఇవ్వకపోగా.. 23మందిలో మాత్రం ప్లాసెబో మెరుగ్గా కనిపించింది. పార్టిసిపెంట్స్ కు 21రోజుల తర్వాత రెండో ఇంజెక్షన్ ఇచ్చారు.
దీనికి సంబంధించిన వాలంటీర్లు ఆస్ట్రేలియాలోని రెండు లొకేషన్ల నుంచి వచ్చారు. వారంతా 60సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే.. పైగా వారందరి నుంచి కొవిడ్-19 పాజిటివ్, కొవిడ్-19 తగ్గిపోయిన వారిని మినహాయించారు. ఫేజ్-1 ట్రయల్ లో వ్యాక్సిన్ సేఫ్.. అవునా కాదా అని టెస్టు చేశారు. దాంతో పాటే దీనికి రెస్పాన్స్ వస్తుందా లేదా అని కూడా పరీక్షించారు.
35 రోజుల పాటు పార్టిసిపెంట్స్ లక్షణాలు, పుల్లగా అనిపించడం వంటివి అనిపిస్తే వాటిని రికార్డు చేశారు. తొలి ఇంజెక్షన్ తర్వాత ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆ సమయంలో స్వాబ్ టెస్టుకు కూడా వెళ్లారు. 35వ రోజు.. సీరియస్ లేకుండా, ప్రమాదరహితంగా కనిపించింది. ఒక్కవ్యక్తికి మాత్రమే జ్వరం రాగా రెండో ఇంజెక్షన్ ఇవ్వడానికి అతనిని మినహాయించారు. చాలా మందిలో ఎటువంటి రియాక్షన్ లేదు. ఇద్దరికి మాత్రం తలనొప్పి, నీరసం వంటివి రెండు రోజుల పాటు కనిపించాయి.
https://10tv.in/bank-robbery-suspect-in-andhra-pradesh/
రెండో వ్యాక్సినేషన్ తర్వాత చాలా మందిలో ఏ సమస్యా కనిపించలేదు. కొద్ది పాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఒక వ్యక్తిలో మాత్రం ఒత్తిడి కనిపించగా అతనిలో రెండో ఇంజెక్షన్ తర్వాత జాయింట్ పెయిన్, నీరసం కనిపించాయి. ఇమ్యూన్ రెస్పాన్స్ పెంచడానికే ఈ వ్యాక్సిన్ రెడీ చేశారు.
35వ రోజు రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు అనేవి న్యూట్రలైజ్ చేయగలిగారు. శరీరం మామూలుగా ప్రొబ్యూస్ చేసే వాటి కంటే 4నుంచి 6సార్లు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యాయి. సహజంగానే శరీరం ఇన్ఫెక్షన్ లేదా టాక్సిన్ నుంచి బయటపడటానికి ఇవి ఉపయోగపడతాయి.
ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ లో పాజిటివ్ రిజల్ట్స్ కనిపించడంతో.. ప్రిలిమనరీ ఎఫిషియన్సీ దొరుకుతుందని ఎక్స్‌పర్ట్ చేశామని డా. గ్రెగరీ గ్లెన్ అన్నారు. ‘నోవావ్యాక్స్ సేఫ్టీ, ఇమ్యూనోజెనిసిటీ సపోర్ట్ చేసేదిగా ఉంది. అమెరికాలోనూ.. ప్రపంచవ్యాప్తంగానూ.. వ్యాక్సిన్ కాన్ఫిడెంట్ గా వాడొచ్చని.. చెప్పారు.
చిల్డ్రన్ హాస్పిటల్ ఆఫ్ ఫిలాడెల్ఫియా పీడియాట్రక్స్ ప్రొఫెసర్ డా.పాల్ అఫ్ఫిట్ బాల్యదశలో ఫలితాలు మెరుగ్గా వస్తాయని చెప్పారు. ‘పదుల్లో వేలల్లో టెస్టులు చేసి ఫలితాలు రాబట్టాలని.. అప్పుడే ఇది ప్రొటెక్టివ్ అని నిరూపించగలమని’ అఫ్ఫిట్ అంటున్నారు.