Odisha Train Accident: పాకిస్థాన్, రష్యా, జపాన్ సహా పలు దేశాల స్పందన

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు.

Odisha Train Accident: పాకిస్థాన్, రష్యా, జపాన్ సహా పలు దేశాల స్పందన

Odisha Train Accident

Updated On : June 3, 2023 / 3:29 PM IST

Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Shalimar-Chennai Coromandel Express) ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో పలు దేశాలు దీనిపై స్పందించాయి.

“భారత్ లో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాను. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ట్వీట్ చేశారు.

జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయాన్ సహా పలువురు నేతలు భారత్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

భారత్ లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని ప్రచండ కూడా ఒడిశా రైలు ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే, మరికొన్ని దేశాలు రైలు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేశాయి.
Odisha train accident: సిగ్నలింగ్ ఫెయిల్యూర్ వల్లే రైలు ప్రమాదం జరిగింది…ప్రాథమిక విచారణలో వెల్లడి