Servant of the People : యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కామెడీ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌లో మళ్లీ వస్తోంది..!
Servant of the People : యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ఆయనో కమెడియన్‌గా యుక్రెయన్లకు సుపరిచితమే. దేశాధ్యక్షుడు కాకముందు జెలెన్ స్కీ నటించిన కామెడీ షో సూపర్ హిట్ అయింది.

On Public Demand, Netflix Brings Back Tv Comedy 'servant Of The People' Starring Ukraine's President Zelensky
Servant of the People : యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ఆయనో కమెడియన్‌గా యుక్రెయన్లకు సుపరిచితమే. దేశాధ్యక్షుడు కాకముందు జెలెన్ స్కీ నటించిన కామెడీ షో (Servant of the People) సూపర్ హిట్ అయింది. ఈ కామెడీ షోనే జెలెన్ స్కీని యుక్రెయిన్ దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగేలా చేసింది. కామెడీ హీరో స్థాయి నుంచి ఒక దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగిన జెలెన్ స్కీ కామెడీ టైమింగ్ సూపర్ అంటారు ఆయన షో అభిమానులు. రష్యా దాడితో జెలెన్ స్కీ ఎవరు అనేది ప్రపంచానికి తెలిసింది. ఆయన రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది.. కామెడీ స్టార్ హోదా నుంచి రాజకీయాల్లోకి ఆయన ఎలా ఎంట్రీ ఇచ్చారు అనేది ఎవరూ ఊహించని విధంగా జరిగిపోయింది.
అప్పట్లో జెలెన్స్ స్కీ నటించిన సెటైరికల్ కామెడీ సిరీస్ ‘Servant of the People’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రజల డిమాండ్ మేరకు ఈ కామెడీ సిరీస్ ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ సిరీస్‌ను అమెరికా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ సిరీస్ 2017 నుంచి 2021 వరకు టెలిక్యాస్ట్ అయింది. ఇప్పుడు ఆ సిరీస్‌నే మళ్లీ అమెరికాలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. రష్యా దండయాత్రపై జెలెన్ స్కీ పోరాడుతున్న తీరు ప్రపంచాన్ని కదిలించింది.

On Public Demand, Netflix Brings Back Tv Comedy ‘servant Of The People’ Starring Ukraine’s President Zelensky
ఈ నేపథ్యంలోనే సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ సిరీస్ మళ్లీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేస్తున్నారు. ఈ కామెడీ సిరీస్‌లో జెలెన్స్కీ టీచర్ పాత్ర.. అనుకోని కారణాల రీత్యా యుక్రెయిన్ దేశాధ్యక్షుడిగా జెలెన్ స్కీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అవినీతిపై ఆయన చేసిన ప్రసంగమే సోషల్ మీడియాలో ఆయన్ను పెద్ద స్టార్‌ను చేసింది. ఆ షోలో అనుకోకుండానే జెలెన్స్కీ యుక్రెయిన్ అధ్యక్షడవుతారు. వాస్తవ జీవితంలోనూ జెలెన్స్కీ రాజకీయాల వైపు మళ్లేందుకు ఈ షోనే కారణంగా చెప్పవచ్చు. మూడు సీజన్ల పాటు ఈ సిరీస్ ప్రసారం అయింది.
అప్పట్లోనే 2019లో యుక్రెయిన్ దేశాధ్యక్ష ఎన్నికల్లో జెలెన్స్కీ పోటీలో నిలిచారు. కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనుకోకుండానే ఆయన ఎన్నికల్లో గెలిచి యుక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. స్వీడన్ ఆధారిత టెలివిజన్ గ్రూపు ఎక్కో రైట్స్ సంస్థకు ఈ లైసెన్సు ఉంది. జెలెన్స్కీ జీవితంలో ఇదో కీలక మైలురాయిగా అవుతుందని సంస్థ వెల్లడించింది. సాధారణ వ్యక్తి అయిన జెలెన్ స్కీ దేశాధ్యక్షుడిగా ఎలా ఎదిగారు అనేది షో ద్వారా చూపించారు.
Read Also : Ukriane Victory : రష్యాపై విజయం సాధించాం-జెలెన్ స్కీ ఆనందం