Ukriane Victory : రష్యాపై విజయం సాధించాం-జెలెన్ స్కీ ఆనందం

రష్యాపై అంతర్జాతీయ కోర్టులో వేసిన కేసులో తమ దేశం పూర్తి విజయం సాధించిందని యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.(Ukraine Victory)

Ukriane Victory : రష్యాపై విజయం సాధించాం-జెలెన్ స్కీ ఆనందం

Ukraine Victory (2)

Ukraine Victory : రష్యాపై అంతర్జాతీయ కోర్టులో వేసిన కేసులో తమ దేశం విజయం సాధించిందని యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. దండయాత్రను వెంటనే నిలిపివేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో తెలిపారు జెలెన్ స్కీ. అంతర్జాతీయ చట్టానికి లోబడి కోర్టు ఆదేశాలను రష్యా తప్పక పాటించాలని జెలెన్ స్కీ తేల్చి చెప్పారు. లేదంటే రష్యా మరింత ఒంటరవుతుందని హెచ్చరించారు.

యుక్రెయిన్ పై సైనిక చర్యను వెంటనే ఆపండి-ఐసీజే ఆదేశం
యుక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు అంతర్జాతీయ కోర్టు (ఐసీజే) కీలక ఆదేశాలు జారీచేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని ఆదేశించింది. అంతేకాదు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యా భద్రతా బలగాలను యుక్రెయిన్ భూభాగం నుంచి వెనక్కి రప్పించాలంది. యుక్రెయిన్‌ భూభాగంపై ఇక నుంచి రష్యా సేనలు గానీ, దానికి మద్దతిచ్చే సాయుధ బృందాలు గానీ ఎలాంటి చర్యలకు పాల్పడరాదని తేల్చి చెప్పింది. (Ukriane Victory)

రష్యా దాడుల నేపథ్యంలో పలు నగరాల్లో మిగిలి ఉన్న పౌరులను ఖాళీ చేయించేందుకు వీలుగా తమ దేశంపై నో -ఫ్లై జోన్‌ ప్రకటించాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై 1000కి పైగా మిసైళ్లను పేల్చాయన్నారు. నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని అడగడం ఎక్కువ అనుకుంటే కనీసం యుక్రెయిన్‌కు యుద్ధ విమానాలైనా అందించాలని కోరారు.(Ukriane Victory)

అమెరికా పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి వర్చువల్‌గా కీలక ప్రసంగం చేసిన జెలెన్ స్కీ.. ఈ సందర్భంగా 9/11 దాడులతో పాటు 1941 డిసెంబర్‌లో పెరల్‌ హార్బర్‌లో జరిగిన బాంబు దాడులను గుర్తుచేశారు. గత మూడు వారాలుగా యుక్రెయిన్‌లో ప్రతి రోజూ అదే తరహాలో దాడులు జరుగుతున్నట్టు ఆయన వాపోయారు. ప్రపంచానికి నాయకుడిగా ఉండటమంటే అర్థం.. శాంతికి నాయకత్వం వహించడమని.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. తమ పోరాటం కేవలం యుక్రెయిన్‌ని మాత్రమే కాపాడుకునేందుకు కాదని.. యూరప్‌, ప్రపంచ విలువల కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు.(Ukraine Victory)

Russia Putin : యుక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం రష్యాకు లేదు : పుతిన్

తమ దేశంపై రష్యా పూర్తిస్థాయిలో దండయాత్ర కొనసాగిస్తోందని.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి ఘటనలను యూరప్‌ ఎన్నడూ చూడలేదని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా వైమానిక దాడులు, క్షిపణి దాడులు చేసినా తాము వెనకడుగు వేయడంలేదని చెప్పారు. రష్యా కేవలం తమ నగరాలపైనా కాకుండా తమ విలువలు, స్వేచ్ఛగా జీవించే హక్కులపైనా కిరాతకంగా దాడిచేస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా యూఎస్‌ కాంగ్రెస్‌ సెషన్‌లో సభ్యులు చప్పట్లతో జెలెన్‌స్కీకి స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు.

గత మూడు వారాలుగా రష్యా సేనలు కొనసాగిస్తున్న భీకర దాడులను ఉక్రెయిన్‌ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ యుద్ధంలో పుతిన్‌ సేనలను తీవ్రంగా దెబ్బకొడుతున్నాయి. ఇప్పటివరకు 13వేల 800 మందికి పైగా రష్యా సైనికులను అంతం చేసినట్టు ఉక్రెయిన్‌ ఆర్మీ వెల్లడించింది. దీంతో పాటు 84 విమానాలు, 108 హెలికాప్టర్లు, 430 యుద్ధ ట్యాంకులు, 1375 సాయుధ శకటాలు, 819 వాహనాలు, 60 ఇంధన ట్యాంకులతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.

Anti-Tank Missiles : రష్యాను భయపెడుతున్న యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌