ప్రపంచానికి గుడ్‌న్యూస్ : ఆస్ట్రాజెనెకా టీకాతో వంద శాతం ఫలితాలు

Astrazeneca vaccine : కరోనాతో అతలాకుతలం అవుతున్న ప్రపంచానికి ఆస్ట్రాజెనెకా గుడ్‌న్యూస్ చెప్పింది. తమ టీకాతో వంద శాతం ఫలితాలు వస్తున్నట్టు ఆ సంస్థ సీఈఓ పాస్కల్ సోరియట్ వెల్లడించారు. తమ పరిశోధన ఫలితాలపై బ్రిటన్‌కు చెందిన స్వతంత్ర రెగ్యులేటర్ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు ఆయన చెప్పారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా కోరనాకు టీకాను అభివృద్ధి చేసింది. ఫైజర్ బయోఎన్‌టెక్ 95శాతం, మోడెర్నా టీకా 94.5శాతం పనితీరును కనబరుస్తున్నట్టు ఇంతకుముందే వెల్లడైంది. ఇప్పుడు ఆస్ట్రాజెనెకా టీకా పనితీరుపై వంద శాతం సంతృప్తి వ్యక్తమైంది.
దీంతో బ్రిటన్‌లో అత్యవసర వినియోగానికి ఆస్ట్రాజెనెకా అప్లై చేసుకుంది. సోమవారం అనుమతులు వస్తాయని అంచనా వేస్తున్నారు. మన దేశంలో పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆస్ట్రాజెనెకాతో కలిసి పనిచేస్తోంది.