ఒక్కసారిగా సీన్ రివర్స్, సింగపూర్ లో నెల రోజులు లాక్ డౌన్
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడుతున్నాయి. కరోనా మహమ్మారికి మందు లేకపోవడంతో.. వైరస్

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడుతున్నాయి. కరోనా మహమ్మారికి మందు లేకపోవడంతో.. వైరస్
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడుతున్నాయి. కరోనా మహమ్మారికి మందు లేకపోవడంతో.. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలన్నీ లాక్‍డౌన్ బాట పట్టాయి. మన దేశంతోపాటు ఎన్నో దేశాలు లాక్‍డౌన్ అమలు చేస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చూస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందున్న దారి ఇదొక్కటే. వేరే ఆప్షన్ లేదు.
తాజాగా లాక్‍డౌన్ ప్రకటించిన దేశాల జాబితాలో సింగపూర్ కూడా చేరింది. వచ్చే మంగళవారం(ఏప్రిల్ 7,2020) నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‍డౌన్ విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని లీ హసీన్ లూంగ్ ప్రకటించారు. ఎమర్జెన్సీ సర్వీసులు, ముఖ్యమైన ఆర్థిక రంగాలు తప్ప అన్ని ఆఫీసులను మూసేస్తామన్నారు. పరిస్థితులు మారుతున్నందున, కరోనా కేసులు పెరుగుతున్నందున కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని ఆయన చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధమన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
సింగపూర్ లో సీన్ రివర్స్, ఒక్కసారిగా పెరిన కరోనా కేసులు:
ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, మార్కెట్లు, సూపర్మార్కెట్లు, క్లినిక్స్, హాస్పిటల్స్, ట్రాన్స్‌పోర్ట్, బ్యాంకిగ్ సర్వీసులు తెరిచే ఉంటాయని లూంగ్ వివరించారు. జనాభా 56 లక్షలున్న సింగపూర్ దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు వెయ్యి దాటాయి. ఐదుగురు చనిపోయారు. సింగపూర్ లో జనవరిలో తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన ప్రభుత్వం తన దగ్గరున్న టెక్నాలజీతో వైరస్ ను కట్టడి చేయగలిగింది. దటీజ్ సింగపూర్ అనిపించుకుంది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.
ఇంతలోనే సింగపూర్ లో సీన్ రివర్స్ అయ్యింది. కొన్ని రోజులుగా అక్కడ కరోనా వైరస్ వేగంగా వ్యాపించింది. అనూహ్యంగా లోకల్ ట్రాన్స్ మిషన్
పాజిటివ్ బాధితులు పెరిగిపోయారు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం పరిస్థితి మరింత సీరియస్ కాకుండా లాక్ డౌన్ ప్రకటించింది. అయితే వెంటనే లాక్ డౌన్ అమల్లోకి తేలేదు. నాలుగు రోజుల టైమ్ ఇచ్చారు.