Sam Altman : ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్పై సోదరి లైంగిక ఆరోపణల కేసులో బిగ్ ట్విస్ట్..
Sam Altman : ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్పై అతని సోదరి యువీ ఆల్ట్‌మన్ లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
OpenAI CEO Sam Altman
- శామ్ ఆల్ట్మన్పై సోదరి లైంగిక వేధింపుల ఆరోపణలు
- కేసును కొనసాగించడానికి న్యాయమూర్తి అనుమతి
- సెయింట్ లూయిస్ ఫెడరల్ కోర్టులో సవరించిన ఫిర్యాదు దాఖలు
Sam Altman : ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్పై అతని సోదరి యువీ ఆల్ట్‌మన్ లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు దశాబ్దకాలంపాటు సోదరుడు శామ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తనకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, న్యాయమూర్తి ఆమె సివిల్ దావాను కొట్టివేసిన తరువాత.. మళ్లీ ఆమె కోర్టును ఆశ్రయించారు. సెయింట్ లూయిస్ ఫెడరల్ కోర్టులో సవరించిన ఫిర్యాదును దాఖలు చేశారు.
యానీ ఆల్ట్‌మన్ కేసులో న్యాయమూర్తి తీర్పు ఇదే..
2008లోనే కాలపరిమితి ముగిసిపోయినందున, యానీ ఆల్ట్‌మన్ లైంగిక దాడి కేసు, హింస ఆరోపణలను కొనసాగించలేరని యూఎస్ జిల్లా జడ్జి జాకరీ బ్లూస్టోన్ గత నెలలో తీర్పు ఇచ్చారు. అయితే, చాలాకాలం క్రితం నాటి కొన్ని ఆరోపణలను అనుమతించే మిస్సోరీ బాల్య లైంగిక వేధింపుల చట్టం కింద ఫిర్యాదును తిరిగి దాఖలు చేయడానికి ఆమెకు అనుమతించారు. ఇప్పుడు, యానీ ఆల్ట్‌మన్ తన సవరించిన ఫిర్యాదును కోర్టులో దాఖలు చేశారు.
శామ్ ఆల్ట్మన్పై ఆరోపణలు ఇవే..
మిస్సోరీలోని క్లేటన్ లో గల ఇంట్లోనే నేను వేధింపులను ఎదుర్కొన్నా. అప్పుడు నాకు మూడేళ్లు. శామ్కు 12ఏళ్లు. 1997 నుండి 2006 మధ్య వరకు అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారానికి పలుమార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. మానసికంగా కుంగిపోయా. ఈ డిప్రెషన్ భవిష్యతుత్లోనూ కొనసాగుతుందేమో అని పేర్కొన్నారు. అయితే, ఓపెన్ ఏఐ సీఈఓపై ఆమె గతంలోనూ ఓసారి ఎక్స్ వేదికగా లైంగిక ఆరోపణలు చేశారు. అయితే, సోదరి ఆరోపణలను ఖండిస్తూ శామ్ ఆల్ట్‌మన్‌తో ఆయన తల్లి, సోదరులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని ఆరోపించింది.
పరువు నష్టం దావా..
శామ్ ఆల్ట్‌మన్ తన సోదరి చేసిన ఆరోపణలను ఖండించడమే కాకుండా, పరువు నష్టం కేసులో తన సోదరిపై కూడా దావా వేశాడు. ఆమె మానసిక ఆరోగ్యంపై కూడా అతను ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిని కుటుంబ సభ్యులు కోర్టులో దాఖలు చేసిన పత్రాలలో అంగీకరించారు.
శామ్ ఆల్ట్‌మన్ Open AI సహవ్యవస్థాపకులలో ఒకరు. 2022లో ChatGPT విడుదల తర్వాత కృత్రిమ మేధపై ఆసక్తి పెరిగిన సమయంలో విస్తృతంగా ప్రసిద్ధి చెందారు. ఫోర్బ్స్ ప్రకారం, అతని నికర ఆస్తి విలువ 3.3 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.
