Hans Zimmer : లైవ్ కన్సర్ట్‌లో గాళ్ ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసిన ఆస్కార్ విజేత .. ఎవరంటే?
భారీ లెవెల్లో మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతోంది. వేలాదిమంది ప్రేక్షకులు చూస్తున్నారు. వేదికపైకి ఎక్కిన ఆస్కార్ విన్నర్.. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ తన ప్రియురాలికి ప్రపోజ్ చేశారు. ఆ తరువాత ఏమైంది?

Hans Zimmer
Hans Zimmer : భారీ లెవెల్లో లైవ్ కన్సర్ట్ జరుగుతోంది. ప్రియురాలికి ప్రేమను తెలపడానికి అదే గొప్ప వేదిక అనుకున్నాడేమో.. ప్రపోజ్ చేసేసాడు. అతను ఆషామాషీ వ్యక్తి కాదు.. ఆస్కార్ విజేత.
96th Oscars : ఆస్కార్ 2024 డేట్స్ ఇవే.. ఈసారి ఇండియా నుంచి వెళ్తాయా??
ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ గురించి తెలియని వారుండరు. ఆయన గురించే ఇప్పుడు చెప్పబోయేది. లండన్‌లో జరిగిన మ్యూజిక్ కన్సర్ట్‌లో తన గాళ్ ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా అతని ప్రేమను వెంటనే అంగీకరించడం విశేషం. హన్స్ జిమ్మెర్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుడు. అతని పేరు మీద 22 గ్రామీ నామినేషన్లు నాలుగు అవార్డులు ఉన్నాయి. జిమ్మెర్ ది లయన్ కింగ్, డూన్, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్, డంకిర్క్ మరియు ది డార్క్ నైట్ వంటి 150 సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు.
తాజాగా ఈ ఆస్కార్ విజేత తన ప్రియురాలు ప్రొడ్యూసర్ అయిన దినా డి లూకాకి లండన్‌లో జరగిన సంగీత కచేరిలో ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ‘ అని చాలా రొమాంటిక్‌గా తన మనసులోని మాట చెప్పేశాడు. వెంటనే ఆమె అంగీకరించడంతో ప్రేక్షకులు చప్పట్లతో మోత మోగించారు.
A R Rahman : అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కి పంపిస్తున్నారు.. ఎ ఆర్ రెహమాన్!
abcnews తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘ మంచి సంగీత దర్శకుడు.. మంచి ప్రపోజర్’ అని ఒకరు.. ‘బ్రేవో, బ్రావో.. మాస్ట్రో.. శుభాకాంక్షలు’ అంటూ చాలామంది స్పందించారు. హన్స్ జిమ్మెర్‌కి గతంలో రెండుసార్లు వివాహం అయ్యింది. ప్రస్తుతం దినా డి లుకాతో ప్రేమలో ఉన్నాడు.
View this post on Instagram