ఆస్కార్ 2020: చరిత్ర సృష్టించిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘పారాసైట్‌’  

  • Published By: sreehari ,Published On : February 10, 2020 / 05:18 AM IST
ఆస్కార్ 2020: చరిత్ర సృష్టించిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘పారాసైట్‌’  

Updated On : February 10, 2020 / 5:18 AM IST

హాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది. ఆస్కార్ అవార్డుల రేసులో ఎన్నో సినిమాలు పోటీపడుతుంటే.. ఎవరూ ఊహించని రీతిలో సౌత్ కొరియన్ ఫిల్మ్ పారాసైట్ ఉత్తమ చిత్రంగా ఎంపిక అయింది. బాంగ్ జూన్ హో దర్శకత్వంలో వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీగా పారాసైట్.. అంతర్జాతీయ సినిమాల్లో మిగతా మూవీలను వెనక్కి నెట్టేసి బెస్ట్ ఫిక్చర్ అవార్డు ఎగురేసుకుపోయింది.

బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే కేటగిరీలో ఫస్ట్ సౌత్ కొరియన్ ఫిల్మ్ గా చోటు దక్కించుకుంది. ఏ కేటగిరీలోనూ ఆస్కార్ వరించని సౌత్ కొరియన్ సినిమాల్లో తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. చార్రిత్రక విజయాన్ని అందుకుంది. గతంలో సౌత్ కొరియా నుంచి హాలీవుడ్ టాప్ ప్రైజ్ లిస్టులో ఏ ఒక్క మూవీకి కూడా చోటు దక్కలేదు.
parasite

ఫస్ట్ టైం.. పారాసైట్ మూవీని ఆస్కార్ వరించింది. ఏ ఫిల్మ్ సాధించని రీతిలో పారాసైట్ ఏకంగా 4 ఆస్కార్ లను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ చిత్రం.. ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇలా మొత్తం నాలుగు కేటగిరీల్లో ఆస్కార్ సొంతం చేసుకుంది.
Oscars: Bong Joon Ho's 'Parasite' Makes History Winning South Korea's First Oscars

విశ్లేషకుల అంచనాలకు కూడా అందకుండా పారాసైట్ ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో థ్రిల్లర్ మూవీ పారాసైట్.. మొత్తం 6 నామినేషన్ల నుంచి బ్రేక్ చేసుకుంటూ ముందుకు దూసుకొచ్చింది. దర్శకుడు బాంగ్, అతని సహ దర్శకులు హాన్ జిన్ ఉత్తమ ఒరిజినల్ స్ర్కీన్ ప్లేకు ఫస్ట్ అవార్డు వరించింది.

ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అందుకున్నందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు బాంగ్ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. స్ర్కిప్ రాసుకున్నది మూవీ కోసమే.. దేశం కోసం ఎప్పుడూ స్ర్కిప్ట్ రాయలేదు.. కానీ, ఇది సౌత్ కొరియాకు దక్కిన మొట్టమొదటి ఆస్కార్ అంటూ ట్రోఫీని పైకెత్తుతూ ఆనందం వ్యక్తం చేశారు.