నో Face Mask అయితే…Shock ట్రీట్ మెంట్..ఎక్కడో తెలుసా

  • Published By: madhu ,Published On : June 11, 2020 / 04:25 AM IST
నో Face Mask అయితే…Shock ట్రీట్ మెంట్..ఎక్కడో తెలుసా

Updated On : June 11, 2020 / 4:25 AM IST

కరోనా కట్టడి కోసం ఓ కొత్త పద్ధతి అవలంభిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి పోలీసులు షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి కరెంట్ షాక్ ఇచ్చే ప్రత్యేక ఎలక్ట్రిక్ షాట్ గన్ పరికరాల్ని తెప్పించారు. అవి లాఠీల లాగా ఉంటాయి. బటన్ నొక్కి… మనిషికి అంటిస్తే చాలు… కరెంటు షాక్ కొడుతుంది. ఈ షాక్ వల్ల మనిషికి ఎలాంటి అపాయమూ ఉండదు.

కానీ ఈ షాక్ ట్రీట్‌మెంట్‌తో ప్రజలకు టెన్షన్ మొదలైంది. పోలీసులను చూడగానే… హడలిపోతున్నారు. కానీ ఆ ప్రయోగం ఫలించింది. ప్రజల్లో మాస్క్ వాడకం పెరిగింది. మరోవైపు… ఈ కరెంటు షాకులపై జనం మండిపడుతున్నారు. ఇదెక్కడ అని అనుకుంటున్నారా..పాకిస్తాన్ లోని ఫైసలాబాద్‌ లో. 

మరోవైపు పాకిస్థాన్‌లో కరోనా ఉధృతి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య సూచన చేసింది. అవసరమైనప్పుడల్లా లాక్ డౌన్ విధిస్తూ దశల వారీగా కరోనా కట్టడికి పూనుకోవాలని సూచించింది. పాక్ ఇటీవలే లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయగా… ఆ తర్వాత పాజిటివ్‌ కేసుల్లో వేగం పుంజుకుంది. అయితే… ఆంక్షల కారణంగా బడుగు వర్గాలపై అత్యధికంగా ప్రతికూల ప్రభావం పడిందని పాక్ ప్రధాని ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు.

పేదల చేతిలో నిరంతరం డబ్బులు పెట్టే స్తోమత తమకు లేదని కూడా  కుండ బద్దలు కొట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే లాక్ డౌన్ ఎత్తివేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆంక్షల ఎత్తివేత కారణంగా అక్కడ కరోనా పేట్రేగిపోతోంది. 

Read: శబరిమల ఆలయంలో పూజలు ఎప్పటినుంచి ప్రారంభమంటే!