Pak : మారని పాక్ బుద్ధి, ఇమ్రాన్ ఖాన్ నోట కశ్మీర్ రాగం
పాకిస్తాన్ మళ్లీ కశ్మీర్ రాగాన్ని ఆలపించింది. కశ్మీర్‌లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ సింపథీ కోసం పాకులాడింది.

Pak
UNGA : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ మళ్లీ కశ్మీర్ రాగాన్ని ఆలపించింది. కశ్మీర్‌లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ సింపథీ కోసం పాకులాడింది. అయితే జిత్తులమారి పాకిస్తాన్‌కు చెంప పగిలేలా సమాధానం ఇచ్చింది భారత్. కుక్క తోక వంకర అన్నట్లు…అంతర్జాతీయ వేదికలపై ఎన్ని చీవాట్లు తిన్నా పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రసంగించారు.
Read More : Nagari : రోజాకు చక్రపాణిరెడ్డి సవాల్..ఇండిపెండెంట్‌గా నిలబడుతా
వేర్పాటు వాద నేత సయ్యద్ అలీ షా గిలానీ పేరును సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్ పాకిస్తాన్ భూభాగమేనని చెప్పకునేందుకు యత్నించారు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశమని చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్య సమితి వేదికపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ దీటుగా స్పందించింది. జమ్ము-కశ్మీర్, లద్దాఖ్ ఎప్పటికీ భారత్‌లోని భూభాగాలేనని మరోసారి స్పష్టం చేసింది భారత్. ఇందులో ఎవరి జోక్యాన్ని సహించేది లేదని గట్టిగా చెప్పింది. కశ్మీర్‌లో పాక్ ఆక్రమించిన భూభాగాలను వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితిలో భారత ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్న స్నేహా దూబె… పాక్ ప్రధానికి గట్టిగా బదులిచ్చారు. పాకిస్థాన్.
Read More : Walrus : వాలీ దొరికిందోచ్..జంతు ప్రేమికుల్లో ఆనందం
తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకొంటోందని.. కానీ ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోందని ఎద్దేవా చేశారు. అమెరికా జంట భవనాలపై ఉగ్రదాడికి పాల్పడిన ఒసామా బిన్‌లాడెన్‌కు ఆశ్రయమిచ్చిందని గుర్తు చేశారు. తనవైపు ఇన్ని తప్పులు పెట్టుకొని అంతర్జాతీయ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ పదునైన వ్యాఖ్యలతో దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు స్నేహా దూబె. పాకిస్థాన్ మైనారిటీలు నిరంతర ప్రాణభయంతో జీవిస్తున్నారని… వారి హక్కుల్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం నిధులు అందజేస్తోందని విమర్శించారు. ఉగ్రవాదులకు బాహాటంగానే మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం, ఆయుధాలు అందించడాన్ని విధానంగా పెట్టుకున్న దేశంగా పాకిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని విమర్శలు కురిపించారు. పాక్ తీరుని ఎండగట్టి వాస్తవాల్ని బయటపెట్టిన స్నేహా దూబెకు యావత్ దేశం ఫిదా అయ్యింది. చూడటానికి బక్కపల్చగా ఉన్నప్పటికీ.. ఆమె బలంగా ఇచ్చిన సమాధానం నెట్టింట్లో వైరల్‌గా మారింది.