India To Afghanistan భారత్ నుంచి అఫ్గాన్ కు వెళ్లే గోధుమ ట్రక్కులను అడ్డుకున్న పాకిస్థాన్

భారతదేశం నుంచి అఫ్గానిస్థాన్ కు వెళ్లే గోధుమల ట్రక్కులను పాకిస్థాన్ అడ్డుకుంది. అఫ్గాన్ ప్రజల ఆకలి తీర్చటానికి భారత్ పెద్దమనస్సుతో గోధుమల్ని పంపుతుంటే పాక్ అడ్డుకుంది.

India To Afghanistan

India To Afghanistan : పాకిస్థాన్ మరోసారి దాని కుటిల బుద్ధిని చూపించుకుంది. భారతదేశం నుంచి అఫ్గానిస్థాన్ కు వెళ్లే గోధుమల ట్రక్కులను పాకిస్థాన్ అడ్డుకుంది. భారత్ అప్ఘానిస్థాన్ దేశానికి పంపిస్తున్న 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమల లారీలను పాకిస్థాన్ అడ్డుకుంది. తాలిబాన్ పాలనకు సాయపడితే అంతర్జాతీయ సమాజం నుంచి వివిధ పరిణామాలు వస్తాయని హెచ్చరికలు వచ్చినప్పటికీ భారత్ పెద్ద మనస్సుతో మానవత్వంతో ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం చేయడానికి భారతదేశం ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగానే భాతర్ అఫ్ఘానిస్థాన్‌కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపిస్తోంది. ఈక్రమంలో గోధుమలను తీసుకెళ్తున్న ట్రక్కులను పాక్ వారి భూమార్గంలో అడ్డుకుంది.  అఫ్ఘాన్ కు పంపించే ట్రక్కులను అనుమతించాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది.

Read more : afghan crisis :అఫ్గాన్ ఆకలి కేకలు..చంటిబిడ్డల కడుపు నింపటానికి ఇంట్లో వస్తువులు అమ్మేస్తున్న దుస్థితి

ప్రస్తుతం శీతాకాలం..పైగా అఫ్గాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. తినటానికి తిండి కూడా లేని దుస్థితిలో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కరువుకు ప్రజలు పడుతున్న బాధల్ని భారత్ చలించిపోయింది. చైనా,టర్కీ వంటి కొన్ని దేశాలు గత కొన్ని వారాలుగా ఆఫ్ఘన్‌లకు ఆహారాన్ని సరఫరా చేయడం ప్రారంభించాయి. అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం గురించి పక్కన పెడితే ఆ దేశ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్న భారత్ కూడా తన వంతుగా సహాయం అందించాలనుకుంది. దాంట్లో భాగంగానే భారీ మొత్తంలో ఆహార ధాన్యాలను అందించాలనుకుంది. అందుకే గోధుమలను భూమార్గంలో పంపిస్తోంది. అంత మొత్తంలో వాయుమార్గంలో రవాణా చేయడం కష్టం కాబట్టి భూ రవాణాను ఉపయోగించాలని భారత్ నిర్ణయించింది. అలా 50,000 మెట్రిక్ టన్నులు గోధుమల్ని భూ రవాణా ద్వారా పంపిస్తోంది.

Read more : Afghan Crisis : పిల్లల ఆకలి తీర్చడానికి పసిగుడ్డు అమ్మకం..

ఈ క్రమంలో పాకిస్థాన్ తమ భూభాగంలో అఫ్గాన్ కు భారత్ గత అక్టోబర్ భూమార్గం ద్వారా ఆహార ధాన్యాల లారీలు పాకిస్థాన్‌కు చేరాయి. అఫ్ఘానిస్థాన్‌కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను తీసుకువెళ్లే ట్రక్కులను తరలించడానికి అనుమతించమని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు లేఖ పంపింది. తాలిబాన్ల పాలనకు గుర్తింపు ఇవ్వడం వల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచించాలని అంతర్జాతీయ సమాజం హెచ్చరించినా..అఫ్ఘానిస్థాన్ ప్రజల ఆకలి తీర్చటానికి భారత్ మానవతా దృక్పథంతో సహాయం చేయాలనే నిర్ణయించుకుంది. శీతాకాలంతోపాటు ఆర్థిక సంక్షోభం అఫ్ఘానిస్థాన్‌ను కుంగదీస్తున్న సమయంలో ఆహార కొరత ఏర్పడింది.

Read more : Afghan 9 years girl sell : అఫ్గాన్‌లో అంగట్లో ఆడపిల్లలు..పెళ్లి పేరుతో డబ్బు కోసం కన్నవారే అమ్మేస్తున్నారు..

చైనా, టర్కీ వంటి కొన్ని దేశాలు గత కొన్ని వారాలుగా అఫ్ఘాన్లకు ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభించాయి.50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను అఫ్ఘానిస్థాన్‌కు తరలించేలా పాకిస్థాన్ మీదుగా 5,000 ట్రక్కులను పంపాల్సి ఉంటుందని ఢిల్లీ అధికారులు చెప్పారు.భారతీయ ట్రక్కులను అనుమతించాలని..లేదంటే వాఘా-అట్టారీ సరిహద్దులోని జీరో పాయింట్ వద్ద గోధుమలను అన్‌లోడ్ చేసి మళ్లీ పాకిస్థాన్ ట్రక్కుల్లోకి ఎక్కించాల్సి ఉంటుందని లాజిస్టిక్స్ సూచిస్తున్నాయి.భారత్ అభ్యర్థనకు రావల్పిండి నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. భారత్ సహాయాన్ని స్వీకరించడానికి తాలిబాన్ సర్కారు సుముఖత వ్యక్తం చేసినా..పాక్ మాత్రం ఆహార ధాన్యాలను అడ్డుకుంటోంది.

Read more : Read more : Afghan..‘Just give us our money’: ఆ బ్యాంకుల్లో డబ్బులు మావే..మా పరిస్థితి బాగాలేదు..మా డబ్బు ఇచ్చేయండి : తాలిబన్లు

కాగా పాక్ లో కూడా ఆహార సంక్షోభం ఉంది. ముఖ్యంగా భారత్ నుంచి పాక్ దిగుమతి చేసుకునే కొన్ని నిత్యావసరాలకు పాక్ దిగుమతి ఆపేసింది. దీంతో పాకిస్థాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈక్రమంలో తాను సహాయం చేయదు..పక్క దేశం అయిన భారత్ సహాయం చేస్తుంటే కూడా పాక్ అడ్డుకోవటం పాకిస్థాన్ కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది.