Pakistan Bus Accident : పాకిస్థాన్‌లో బస్సు బోల్తా పడి 13 మంది మృతి

పాకిస్థాన్‌లోని సుక్కూర్ జిల్లా హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు.

Pakistan Bus Accident : పాకిస్థాన్‌లో బస్సు బోల్తా పడి 13 మంది మృతి

Pakistan 13 Killed, 32 Injured In Road Accident On Highway Near Sukkur

Updated On : May 20, 2021 / 12:17 PM IST

Pakistan Bus Accident : పాకిస్థాన్‌లోని సుక్కూర్ జిల్లా హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అధిక వేగంతో దూసుకెళ్తున్న బస్సు ముల్తాన్‌ నుంచి కరాచీకి వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు.

వీరిలో 13 మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన బస్సును క్రేన్‌ సాయంతో పైకి ఎత్తారు.

బస్సులో చిక్కుకుపోయిన మృతదేహాలతో పాటు క్షతగాత్రులను బయటకు తీశారు. తీవ్ర గాయాలతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.