Baloch Rebels : పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి, 90మంది సైనికులు మృతి?

పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన దాడిని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ ఖండించారు.

Baloch Rebels : పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి, 90మంది సైనికులు మృతి?

Updated On : March 16, 2025 / 4:44 PM IST

Baloch Rebels : బలూచ్ లో పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి జరిగింది. బలూచ్ తిరుగుబాటుదారులు జరిపిన ఈ దాడిలో 90 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఈ మేరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అయితే, దీనిపై పాకిస్థాన్ పోలీస్ అధికారుల వెర్షన్ మరోలా ఉంది. కేవలం ఐదు పారామిలిటరీ దళాలు మాత్రమే దాడిలో చనిపోయాయని వెల్లడించారు. పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ పై దాడి చేసింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. కాన్వాయ్ లో 8 బస్సులు ఉన్నాయని, అందులో ఒకటి పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైందని బలూచ్ రెబల్స్ తెలిపారు.

Also Read : ఐఎస్ఎస్‌కు చేరుకున్న‌ క్రూ-10.. సంతోషంతో డ్యాన్స్ చేసిన సునీతా విలియమ్స్.. వారు భూమిపైకి వచ్చేది ఎప్పుడంటే?

”కాన్వాయ్ లో ఏడు బస్సులు ఉన్నాయి. అవన్నీ ఇరానియన్ బోర్డర్ టప్టాన్ వైపు వెళ్తున్నాయి. నోష్కి దగ్గర పేలుడు పదార్ధాలతో నిండి ఉన్న కారు కాన్వాయ్ లోని ఒక బస్సుని ఢీకొట్టింది” పాక్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన దాడిని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ భగ్తీ ఖండించారు.

కాగా, ఇటీవలే జాఫర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేయడం సంచలనం రేపింది. 450 మంది ప్రయాణికులను బందీలుగా చేసుకుంది. వారిలో ఆర్మీ అధికారులు కూడా ఉన్నారు. మష్కాఫ్ టన్నెల్ దగ్గర క్వెట్టాకు 157 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. 9 బోగీలు ఉన్న ట్రైన్ క్వెట్టా నుంచి కైబర్ ఫక్తువాకు వెళ్తోంది. ఆ సమయంలో బాంబు దాడి జరిగింది.

వెంటనే అప్రమత్తమైన మిలిటరీ అధికారులు రంగంలోకి దిగారు. కొన్ని గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. బలూచ్ వేర్పాటువాదులను హతం చేసి బందీలను విడిపించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది.