Pakistan PM: పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు జరిమానా
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ ఎలక్షన్ కమిషన్ జరిమానా విధించింది. ఇటీవల స్వాత్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గానూ రూ.50వేలు జరిమానా..

Imran Khan
Pakistan PM Imran Khan: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ ఎలక్షన్ కమిషన్ జరిమానా విధించింది. ఇటీవల స్వాత్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గానూ రూ.50వేలు జరిమానా విధించింది. కైబర్ – ఫంఖ్తున్క్వాలో స్థానిక ప్రభుత్వ ఎన్నికలు జరుగుతుండగా.. ప్రచారంలో పాల్గొనవద్దని, మార్చి 15న స్వాత్ ను సందర్శించొద్దని, అక్కడ జరిగే బహిరంగ సభలకు వెళ్లొద్దంటూ విధించిన ఈసీ నిషేదాన్ని బేఖాతరు చేశారు ఇమ్రాన్.
చెప్పిన మరుసటి రోజే ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సంఘం కొత్త నియమావళి ప్రకారం.. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రభుత్వ ప్రతినిధులు పర్యటించారు. మార్చి 31న కైబర్ పంఖ్తున్క్వాలో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ప్రధానికి రెండు సార్లు ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఇమ్రాన్ ఖాన్ తో పాటు మరో ఐదుగురికి జరిమానా విధించారు. విదేశాంగ శాఖ మంత్రి షా మెహమ్మూద్ ఖురేషీ, ఖైబర్ పంక్తున్క్వా సీఎం మొహమూద్ ఖాన్, మురాద్ సయ్యద్, డా. అంజద్ అలీ, మొహీబుల్లాలకు జరిమానాలు విధించారు.
Read Also: పాకిస్తాన్‌లో చాలా సేఫ్‌గా అనిపిస్తుంది
వాటిని వ్యతిరేకిస్తూ.. పాకస్తాన్ ప్రధాని, ప్రణాళికా శాఖ మంత్రి అసద్ ఒమర్ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవర్తనా నియమావళిని అమలుచేసే అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేసింది.