Joe Biden: పాకిస్తాన్ అత్యంత ప్రమాదకర దేశం: జో బైడెన్

పాకిస్తాన్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Joe Biden: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని విమర్శించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. క్యాలిఫోర్నియాలోని ఇర్విన్‌లో శుక్రవారం జరిగిన డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ కార్యక్రమంలో బో బైడెన్ పాల్గొన్నారు.

Class 9 Girl: పరీక్షలో కాపీ కొడుతుందని అనుమానం.. బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంశంతోపాటు, ఇతర దేశాలతో అమెరికాకు గల సంబంధాల గురించి వివరించారు. దీనిలో భాగంగా పాకిస్తాన్‌పై విమర్శలు చేశారు. ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశం ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉంది’’ అని బైడెన్ అన్నారు. 1998 నుంచి పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు జరుపుతోంది. అయితే, పాకిస్తాన్ అణ్వస్త్రాలపై పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రవాద దేశమైన పాకిస్తాన్ దగ్గర అణ్వయుధాలు ఉండటం వల్ల అవి తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Women Asia Cup 2022: మహిళల ఆసియా కప్ విజేత భారత్.. ఏడోసారి కప్పు గెలిచిన టీమిండియా

ఈ సమావేశంలో జో బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తనకు వ్యక్తిగతంగా గల సంబంధాలను గుర్తు చేసుకున్నాడు. ‘‘ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిన్‌పింగ్‌తో సమన్వయం చేసే బాధ్యతల్ని నాకు అప్పగించాడు. అప్పుడు ఆయనతో ఎక్కువసార్లు గడిపే అవకాశం వచ్చింది. ప్రపంచంలోని ఇతర నేతలతో పోలిస్తే జిన్‌పింగ్‌తో ఎక్కువ సమయం గడుపుతూ, దగ్గరగా ఉన్నది నేనే. ఆయనకు సమస్యలపై అవగాహన ఉంది’’ అని బైడెన్ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు