Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్ కోట్ ఎయిర్ పోర్టులను 48గంటల పాటు మూసివేసింది.

Pakistan PM Shehbaz Sharif

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ, ఎయిర్ పోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా మెరుపుదాడులు చేశాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ దాడులు చేయగా.. 80మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు సమాచారం.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు..

ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ‘‘పాకిస్థాన్ లోని ఐదు ప్రాంతాల్లో నమ్మకద్రోహి శత్రువు పిరికి దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్, ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం’’ అని ఎక్స్ లో పోస్టు చేశారు.


భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్ కోట్ ఎయిర్ పోర్టులను 48గంటల పాటు మూసివేసింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు పాక్ ప్రధాని షరీప్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశం కానున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ ప్రధాని ప్రకటన తరువాత సరిహద్దుల్లోని పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాకిస్థాన్ సైన్యం కాల్పులు ప్రారంభించింది.