Pakistan : దేశం దాటి వచ్చిన మరో ప్రేయసి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ .. షాకిచ్చిన పోలీసులు
బ్రిటన్ నుంచి ఓ మహిళ పాక్ యువకుడిపై మనసు పారేసుకుని వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు పాకిస్థాన్ వ్యక్తి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Pak man British woman Pakistan lover
Pakistan police : ఇటీవల భారత దేశంలో విదేశీ వనితల ప్రేమకథలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో పరిచయం అయి దేశాలు దాటి భారత్ వస్తున్న వనిత ప్రేమకథలు అదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పబ్జీ గేమ్ తో పాక్ వనిత సీమా హైదరి యూపీ యువకుడిపై ప్రేమ పెంచుకుని వచ్చేసింది.దీనిపై ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. అలాగే బంగ్లాదేశ్ వనిత యూపీ యువకుడిపై మనస్సు పారేసుకుని వచ్చి పెళ్లి చేసుకుంది. అలాగే శ్రీలంక యువతి ఏపీ యువకుడిపై మనసుపడి ప్రియుడిని వెతుక్కుంటు వచ్చి మూడు ముళ్లు వేయించుకుంది. ఇలా దేశ సరిహద్దులే కాదు సముద్రాలు కూడా దాటి వస్తున్న ప్రేమకథను ఆసరాగా చేసుకున్న ఓ యువకుడు తాను కూడా వారిలో ఫేమస్ అవ్వాలనుకున్నాడు. అదే సోషల్ మీడియా వేదిగా ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
బ్రిటన్ నుంచి ఓ మహిళ పాక్ యువకుడిపై మనసు పారేసుకుని వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సదరు బ్రిటన్ యువతికి భద్రత కల్పించేందుకు అంతా సిద్ధమై సదరు యువకుడు పెట్టిన స్థలానికి చేరుకున్న పోలీసులు షాక్ అయ్యారు. సదరు యువకుడిని వెతికి పట్టుకోగా..తూచ్ అంతా వట్టిదే ఏదో కామెడీ చేద్దామనుకున్నా అని చెప్పేసరికి పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. అంతే కామెడీలు చేస్తావా కామెడీలు అంటూ అతడిని కాస్తా పట్టుకెళ్లి లోపలేశారు.
పాకిస్థానీ వార్తా సంస్థ ‘ఆజ్ ఇంగ్లీష్’ కథనాల ప్రకారం..పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్న ఖ్వాకు చెందిన ఓ వ్యక్తి మహ్మద్ గులాబ్ ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్‌ను చూసిన పోలీసులు మహిళకు భద్రత కల్పించేందుకు రంగంలోకి దిగారు. సదరు పోస్టులో ఉణ్న అడ్రస్ కు వచ్చారు. కానీ అక్కడ అక్కడ ఎవరూ కనిపించలేదు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వెంటనే మహ్మద్ గులాబ్‌ను అరెస్ట్ చేశారు. అతని అరెస్టును స్థానికులు వ్యతిరేకించారు. అరెస్ట్ చేయాలంటే సీనియర్ల నుంచి అనుమతి తీసుకురావాలని అప్పటి వరకు అతనిని అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదని డిమాండ్ చేశారు.
Jaipur Express Train : జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి