Jaish-e-Mohammed: బరితెగించిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్.. మరో భారీ కుట్ర.. ఇక మహిళలకు కూడా..

భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ కకావికలమైంది. అయినా దానికి బుద్ధి రాలేదు.

Jaish-e-Mohammed: బరితెగించిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్.. మరో భారీ కుట్ర.. ఇక మహిళలకు కూడా..

Updated On : October 24, 2025 / 6:57 PM IST

Jaish-e-Mohammed: పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ మరింత బరితెగించింది. భారీ కుట్రకు తెరలేపింది. ‘జమాత్ ఉల్ మొమినాత్’ పేరుతో తన తొలి మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ఈ ఉగ్రవాద సంస్థ.. తాజాగా నిధుల సేకరణకు మరో కన్నింగ్ ప్లాన్ వేసింది. ‘తుఫత్ అల్ ముమినత్’ పేరుతో ఆన్‌లైన్ కోర్సును కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా నిధులు సేకరించడమే కాకుండా మరింత మంది మహిళలను ఆకర్షించాలని స్కెచ్ వేసింది.

ఈ ఆన్ లైన్ కోర్సులో జిహాదీ, మతపరమైన అంశాలపై మహిళలకు శిక్షణ ఇస్తారని సమాచారం. మహిళలను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు లైవ్ క్లాస్‌లు ప్రారంభించనున్నారు. నవంబర్ 8న నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. రోజూ 40 నిమిషాల సేపు సెషన్స్ ఉంటాయని, మసూద్ అజార్ కుటుంబ సభ్యులు, అతని కమాండర్లు మహిళలకు శిక్షణ ఇస్తారని జైషే మొహమ్మద్ వర్గాలు తెలిపాయి. కాగా, ఇందులో పాల్గొనే ప్రతి మహిళ 500 రూపాయలు విరాళంగా ఇవ్వాలని కోరారు.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ కకావికలమైంది. అయినా దానికి బుద్ధి రాలేదు. తిరిగి పుంజుకునేందుకు, నెట్ వర్క్ ను విస్తరించుకోవడానికి కొత్త స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా జైషే మహమ్మద్ తొలిసారి మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Also Read: పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. భారత్ తర్వాత.. నదీ జలాలను నిలిపివేయనున్న మరో దేశం..