Pakistan: పాకిస్థాన్‌ నుండి 2022లో ఉద్యోగాలకోసం ఎంతమంది విదేశాలకు వెళ్లారో తెలుసా?

గతేడాది పాకిస్థాన్ నుంచి 2.25లక్షల మంది యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. 2020 సంవత్సరంలో 2.88 లక్షల మంది విదేశాలకు వెళ్లారు. ఇందులో 92వేల మంది ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో యువత, ఉన్నత విద్యావంతులు ఉపాధికోసం విదేశాల బాటపట్టారు.

Pakistan: పాకిస్థాన్‌ నుండి 2022లో ఉద్యోగాలకోసం ఎంతమంది విదేశాలకు వెళ్లారో తెలుసా?

Pakistan Youth

Updated On : December 14, 2022 / 10:48 AM IST

Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఏడాది సంభవించిన వరదలు ప్రజల్లో విషాదాన్ని నింపాయి. యువత ఉద్యోగాలులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదివిన చదువులకు సరియైన సంపాదన లేకపోవటంతో విదేశాలకు పయణమవుతున్నారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది భారీ సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలకోసం ఆ దేశాన్ని వీడారు. గతేడాది 2021 సంవత్సరంలో 2.25లక్షల మంది యువత ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లగా. 2020 సంవత్సరంలో 2.88 లక్షల మంది విదేశాలకు వెళ్లారు. ఇందులో 92వేల మంది ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ఏడాది దేశంలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నారు.

Pakistan Cricket Fans: కోహ్లీకి పాక్ అభిమానుల విజ్ఞప్తి .. అలాచేస్తే బాబర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తారట ..

2022 లో  7.65లక్షల మంది ఉపాధి వెతుక్కుంటూ పాకిస్థాన్ ను విడిచివెళ్లినట్లు నివేదికలు చెబుతున్నారు. వీరిలో ఎక్కువగా వైద్యులు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, అకౌంటెంట్లు ఉన్నారు. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రకారం.. ఈ వలసదారులలో ఎక్కువ మంది సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వెళ్లారు. అదేవిధంగా రోమేనియా యూరోపియన్ దేశాలకు వెళ్లేందుకు పాకిస్థానీయులు ఎక్కువ ఇష్టపడుతున్నారట.

Pakistan-China: చైనా ప్రభావం అధికంగా పడుతున్న 82 దేశాల జాబితాలో పాకిస్థాన్ నం.1

ఈ విషయంపై ఓ అధికారి మాట్లాడుతూ.. ద్రవ్వోల్బణం, నిరుద్యోగం, అనిశ్చిత ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో యువత ఇబ్బంది పడుతున్నారని, ఈ క్రమంలో ఉపాధికోసం ఇతర దేశాలకు వెళ్తున్నారని తెలిపారు. తాజా నివేదికల ప్రకారం.. 2022లో దేశం విడిచివెళ్లిన వారిలో 92,000 మందికి పైగా గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మరో 3.50లక్షల మంది శిక్షణ పొందిన కార్మికులు , సమాన సంఖ్యలో నైపుణ్యం లేని కార్మికులు ఉన్నారు. 7.36లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.