Funny parrot : భలే భలే అన్నీ పడేసానోచ్ అంటూ.. డ్యాన్స్ చేస్తున్న చిలిపి చిలకమ్మ
ఈ చిలుకలు ఏమైందో ఏమోగానీ వస్తువులల్నీ కిందపారేస్తోంది. ముక్కుతో నెట్టుకుంటూ తీసుకెళ్లి టేబుల్ పైనుంచి కిందపారేస్తోంది. ప్యాకెట్లు, కూల్ డ్రింగ్ బాటిల్, ఆఖరికి గాజు గ్లాసుల్ని కూడా కింద పారే భలే భలే పారేసానోచ్ అంటూ డ్యాన్స్ కూడా చేస్తోంది.

Funny parrot
Funny parrot : చిట్టి చిలకమ్మలన్ని అదేపనిగా చూడాలనిపిస్తుంది.వాటి హావభావాలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. ముద్దుగా పలికే వాటి పలుకులు..తమాషాగా అవి చేసే పనులు భలేగా అనిపిస్తాయి. చిలుకలు కొంటెపనులు చేసినా..పాడు పనులు చేసినా ముద్దుగానే ఉంటాయి. అటువంటి ఓ చిలకమ్మ చేసే పాడు పనులు చూడండీ తిక్క లేచిందో ఏమోగానీ విచిత్రంగా ప్రవర్తిస్తోంది ఓ చిలుకమ్మ. ఈ చిలుకలు ఏమైందో ఏమోగానీ వస్తువులల్నీ కిందపారేస్తోంది. ముక్కుతో నెట్టుకుంటూ తీసుకెళ్లి టేబుల్ పైనుంచి కిందపారేస్తోంది. ప్యాకెట్లు, కూల్ డ్రింగ్ బాటిల్, ఆఖరికి గాజు గ్లాసుల్ని కూడా కింద పారే భలే భలే పారేసానోచ్ అంటూ డ్యాన్స్ కూడా చేస్తోంది. చిలకలను చూస్తే భలే ముద్దొస్తాయి. అవి ఎన్ని కొంటెపనులు చేసినా కోపమే రాదు. పాడు పనులు చేసినా ముద్దుగానే ఉంటుంది. అటువంటిదే వస్తువలన్నింటిని కిందపారేసి ఏదో ఘనకార్యం చేసినట్లుగా డ్యాన్స్ చేస్తున్న ఈ చిలకమ్మ కూడా అంతే ముద్దొస్తోంది. వస్తువుల్ని కిందపారేసి డ్యాన్స్ చేస్తున్న చిలకమ్మ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో.. ఓ చిలుకమ్ టేబుల్‌పై నిల్చుంది. ఇంటి యజమాని ఆ టేబుల్‌పై ఓ బాటిల్ పెట్టారు. పక్కనే ఉన్న చిలుక.. ఆ బాటిల్‌ను కిందకు తోసేసింది. ఆ తరువాత మరో ప్యాకెట్ పెడితే.. దాన్ని కూడా పడేసింది. గాజు గ్లాసుల్ని కూడా పడేసింది. ఇలా ఆ టేబుల్ పై ఏది పెడితే అది కిందపడేసి పైగా డ్యాన్స్ కూడా చేస్తోంది. పైగా అవి పడిందా లేదా అని చెక్ చేసి..మరీ చిందులేసింది. ఈ ఫన్నీ వీడియోను ట్విట్టర్ అకౌంట్ @buitengebieden లో షేర్ చేయగా.. నెటిజన్లు కూడా ఈ చిలకమ్మ చేసే పనులకు ఫిదా అవుతున్నారు. కొంతమంది కంత్రీ ప్యారట్ అంటూ కామెంట్స్ చేస్తుంటే..మరికొందరు ఏందమ్మో ఏదో ఘనకార్యం చేసినట్లుగానే డ్యాన్సులాడుతున్నావే అంటున్నారు. ఇంకొందరు ఇటువంటి పెంకి చిలకమ్మతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి…
Who’s bad? ??
? IG: hubertthebird pic.twitter.com/kAvwv28DXJ
— Buitengebieden (@buitengebieden) September 5, 2022