London : మామిడి పండ్ల కోసం తన్నుకున్నారు.. ఎక్కడంటే?

పండ్లలో రాజు మామిడి పండు అంటే అందరికీ మక్కువే. అయితే వీటిని దుకాణాల్లో యుద్ధాలు చేసి మరీ కొంటారని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఎక్కడంటారా? లండన్‌లో..

London : మామిడి పండ్ల కోసం తన్నుకున్నారు.. ఎక్కడంటే?

London

Updated On : June 23, 2023 / 7:11 PM IST

London : మంచినీళ్ల కోసం వీధి కుళాయిల దగ్గర దెబ్బలాటలు చూసాం. బస్సులో సీటు కోసం కొట్టుకోవడం చూసాం. ఇక మామిడిపండ్ల యుద్ధాలు జరుగుతున్నాయి. అదీ ఇండియాలో కాదు.. లండన్ లో..

Minister KTR: లండన్‌లో కేటీఆర్.. 22ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో చూశారా?

మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వారు అరుదుగా ఉంటారు. అంతగా ఇష్టపడే మామిడిపండ్లు స్టాక్ అయిపోయాయో?.. ఉన్న పండ్లు నాకు కావాలంటే నాకు అని వాదులాడుకున్నారో?.. లండన్‌లో ఓ వీధి యుద్ధభూమిని తలపించింది. మామిడిపండ్ల కోసం ఆడ,మగ లాక్కున్నారు.. తన్నుకున్నారు.. కొట్టుకున్నారు.. @gharkekalesh అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మామిడిపండ్ల కోసం ఇంత గొడవ అవసరమా?  అని చూసేవారికి ఆశ్చర్యం కలగకమానదు.

London: ఇదేం ట్రెడిషన్ బాబూ.. ప్యాంట్లు తొడుక్కోకుండా లండన్ వీధుల్లో తిరుగుతున్న జనం… కారణమేంటో తెలుసా?

ఇక ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. ఎవరికి ఎన్ని మామిడిపండ్లు దక్కాయో? ఎవరు ఎన్ని తన్నులు తిన్నారో? ఈ గొడవ ఎలా సర్దుమణిగిందో?  తెలియదు కానీ ఈ కొత్త యుద్ధం మాత్రం విచిత్రంగానూ.. ఆశ్చర్యంగాను ఉందని నెటిజన్లు షాకవుతున్నారు. మామిడిపండ్ల మజాకానా? అని బుగ్గలు నొక్కుకున్నవారు ఉన్నారండోయ్.